IPL Auction 2025 Live

Kantara 2: కాంతార-2 క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్, ఉగాది రోజు స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టినట్లు ప్రకటించిన రిషబ్‌షెట్టి, ప్రకృతితో మమేకమయ్యే మరో కథ కోసం జర్ని మొదలంటూ ట్వీట్

ఈ క్రేజీ న్యూస్‌పై అధికారికంగా క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్‌. మూవీ లవర్స్‌, దేశప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ.. పాపులర్‌ ప్రొడక్షన్ హౌజ్‌ (HombaleFilms) కాంతారావు రెండో పార్టుకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ పనులు ప్రారంభమైనట్లు ప్రకటించారు.

Still from Kantara (Photo Credit: Wiki)

Bengalore, March 22: కేజీఎఫ్‌ తర్వాత కన్నడ ఇండస్ట్రీ నుంచి విడుదలై పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది కాంతార (kantara). కన్నడ హీరో రిషబ్‌ శెట్టి (Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రం కన్నడతోపాటు విడుదలైన అన్ని భాషల్లో రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టి.. టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచింది. కేజీఎఫ్‌ ఫేం హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌లో విజయ్‌ కిరగందూర్‌ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 30న కన్నడలో విడుదలైంది. ఆ తర్వాత తెలుగులో కూడా రిలీజై నిర్మాతలకు కాసుల పంట పండించింది. కాగా ఈ సినిమాకు సీక్వెల్‌ ఉండబోతుందని ఇప్పటికే ఓ అప్‌డేట్ ఇండస్ట్రీ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది. ఈ క్రేజీ న్యూస్‌పై అధికారికంగా క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్‌.

మూవీ లవర్స్‌, దేశప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ.. పాపులర్‌ ప్రొడక్షన్ హౌజ్‌ (HombaleFilms) కాంతారావు రెండో పార్టుకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ పనులు ప్రారంభమైనట్లు ప్రకటించారు. ప్రకృతితో మన అనుబంధాన్ని ప్రతిబింబించే ఆకర్షణీయమైన కథనం కోసం రెడీగా ఉండండి. మరిన్ని అప్‌డేట్‌ల కోసం చూస్తూనే ఉండండి.. అంటూ ట్వీట్ చేసింది. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Tesla Cars Naatu Naatu Dance: 'నాటు నాటు' పాటకు అదిరిపోయేలా టెస్లా కార్ల లైటింగ్.. అమెరికాలో లయబద్ధంగా లైటింగ్ షో.. వందల కొద్దీ టెస్లా కార్లతో అద్భుతమైన సన్నివేశం.. వైరల్ వీడియో ఇదిగో 

అంజనీష్‌ లోక్‌ నాథ్‌ అందించిన మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. సప్తమి గౌడ, కిశోర్‌, అచ్యుత్‌ కుమార్‌, నవీన్‌ డీ పడ్లి, ప్రమోద్‌ శెట్టి కీలక పాత్రల్లో నటించారు. మరి సీక్వెల్‌ పార్టులో భాగం అయ్యే నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులెవరనే దానిపై రానున్న రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్‌.



సంబంధిత వార్తలు

TG Weather Update: తెలంగాణపై చలి-పులి పంజా.. అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలలోపు రాత్రి ఉష్ణోగ్రతలు.. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ (యూ)లో రికార్డు స్థాయిలో 8.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. రానున్న మూడ్రోజుల్లో ఇంకా పడిపోనున్న ఉష్ణోగ్రతలు

Rains in AP: బంగాళాఖాతంలో వాయుగుండం.. నేటి నుంచి ఏపీలో భారీ వర్షాలు.. ఈ నెల 29 వరకు వానలే వానలు.. దక్షిణ కోస్తాలో ఈదురుగాలులు

TG Weather Update: చలితో గజగజలాడుతున్న తెలంగాణ.. సంగారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 9 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయిన ఉష్ణోగ్రతలు.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిక

Rains in AP: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. ఎల్లుండి నుంచి ఏపీలో భారీ వర్షాలు.. మూడు రోజుల పాటు సముద్రంలో అలజడి.. మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని అధికారుల హెచ్చరికలు