Mahesh Babu: మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన మహేష్ బాబు, 40 మంది పేద విద్యార్థుల ఉన్నత విద్యకు అయ్యే ఖర్చు మొత్తం భరిస్తానని ప్రకటన
న తండ్రి సూపర్ స్టార్ కృష్ణ తొలి వర్ధంతి సందర్భంగా దాదాపు 40 మంది పేద విద్యార్థులకు వాళ్లు చదువుకునే ఉన్నత విద్యకు అయ్యే ఖర్చు మొత్తం ..ఎంబీ ఫౌండేషన్ ఆద్వర్యంలో సమకూరుస్తుందని మహేష్ బాబు తెలియజేసాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతను పేరు వినగానే మనకు మంచి మెసేజ్ ను ఇచ్చే ఓరియెంటెడ్ సినిమాలే గుర్తుకు వస్తాయి. అలాగే ఊరుని దత్తత తీసుకోవడం, వ్యవసాయం చేయడం లాంటి సందేశాల్ని సినిమాల ద్వారా ప్రేక్షకులకు చూపిస్తూ మంచి హిట్స్ ను అందుకున్నాడు. తాజాగా గుంటూరు కారం లాంటి మాస్ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు ముందుకు రాబోతున్నాడు.
అదే విధంగా మహేష్ బాబు ఫౌండేషన్ ను స్థాపించి ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లకు చేయూతను ఇస్తున్నాడు. అలాగే ఇప్పుడు మరో మంచిపనికి శ్రీకారం చుట్టాడు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ తొలి వర్ధంతి సందర్భంగా దాదాపు 40 మంది పేద విద్యార్థులకు వాళ్లు చదువుకునే ఉన్నత విద్యకు అయ్యే ఖర్చు మొత్తం ..ఎంబీ ఫౌండేషన్ ఆద్వర్యంలో సమకూరుస్తుందని మహేష్ బాబు తెలియజేసాడు. అతను తాజాగా ఎడ్యుకేషనల్ ఫండ్ పేరుతో స్కాలర్ షిప్ ప్రో గ్రామ్ ని ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో విద్యార్థులంతా కలిసి మహేష్ బాబు పేరును నిలబెడతామని తెలిపారు.
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న తెలుగు హీరోల్లో కన్నా మహేష్ బాబు కొంచెం డిఫరెంట్ మైండ్. తను ఎప్పుడు ఖాళీగా ఉండకుండా.. సినిమా షూటింగ్ లేదంటే ఫ్యామిలతో టూర్స్ వెళుతుంటాడు. వీటికి మధ్యలో అప్పుడప్పుడు యాడ్స్ చేస్తూ బీజీబిజీగా గడుపుతుంటాడు. ఇంకా ఇవన్నీ పక్కనపెడితే ఎంబీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాదాపుగా 2500 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించాడు. అలానే తన సొంతూరైన బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకొని.. ఆ గ్రామ బాగోగులను దగ్గరుండి చూసుకుంటున్నాడు.
ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళితో కలిసి పనిచేస్తున్నాడు. దీని మీద భారీ అంచనాలు ఉన్నాయని.. కాకపోతే ఈ సినిమా విడుదల కావడానికి మరో మూడు నాలుగేళ్లు పట్టేలా ఉంది,