Chiranjeevi's Acharya: చిరు ఆచార్య సినిమాలో మహేష్ బాబు, అంతా రూమర్స్ అంటూ కొట్టిపడేసిన మెగాస్టార్, మహేష్ నా కొడుకులాంటి వాడు, అవకాశం వస్తే తప్పక నటిస్తామన్న చిరంజీవి

ఈ సినిమాలో ఓ అతిథి పాత్రలో ప్రిన్స్ మహేశ్‌బాబు (Mahesh Babu) నటిస్తున్నారనే వార్తలు ఆ మధ్య హల్ చల్ చేశాయి. దీనిపై అటు ఆచార్య చిత్ర బృందం కానీ, మహేశ్‌ బాబు కానీ స్పందించలేదు. తాజాగా ఈ పుకార్లపై చిరంజీవి క్లారిటీ ఇచ్చారు.

megastar Chiranjeevi on rumours of Mahesh Babu's cameo in Acharya: Don't know how his name came up (photo-Twitter)

Hyderabad, April 6: సైరా నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా సంచలన డైరెక్టర్‌ కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఆచార్య (Chiranjeevi's Acharya). మ్యాటినీ ఎంటర్‌ టైన్‌మెంట్‌, కొనిదల ప్రొడక్షన్‌ బ్యానర్స్‌పై రామ్‌ చరణ్‌, నిరంజన్‌ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిరంజీవి సరసన కాజల్‌ నటిస్తోంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. కాగా కరోనా వైరస్‌ (coronavirus) నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడింది.

తెలుగు సినీ హీరోలను మెచ్చుకున్న ప్రధాని

అంతా బానే ఉంది కాని ఈ సినిమా మీద ఓ రూమర్ ఈ మధ్య చక్కర్లు కొట్టింది. ఈ సినిమాలో ఓ అతిథి పాత్రలో ప్రిన్స్ మహేశ్‌బాబు (Mahesh Babu) నటిస్తున్నారనే వార్తలు ఆ మధ్య హల్ చల్ చేశాయి. దీనిపై అటు ఆచార్య చిత్ర బృందం కానీ, మహేశ్‌ బాబు కానీ స్పందించలేదు. తాజాగా ఈ పుకార్లపై చిరంజీవి క్లారిటీ ఇచ్చారు.

ఓ ప్రముఖ ప‌త్రిక‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ.. అసలు ఆచార్యలో మ‌హేష్ న‌టిస్తున్నాడ‌న్న వార్త ఎలా బ‌య‌ట‌కి వ‌చ్చిందో అర్ధం కావ‌డం లేదు అని అన్నారు. మహేశ్‌ ఎంతో అద్భుతమైన స్టార్ అని, తనతో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని చెప్పారు. ‘మ‌హేశ్‌ని నేను చాలా గౌర‌విస్తాను. ఆయ‌న కూడా న‌న్ను అంతే ప్రేమిస్తారు. మ‌హేశ్‌ నాకు కొడుకు లాంటి వాడు. ఆయన తో క‌లిసి సినిమా చేసే ఛాన్స్ వ‌స్తే త‌ప్పక చేస్తాను. కానీ ఆచార్యలో నటించమని ఆయనను మా టీమ్‌ సంప్రదించలేదు. అ వార్తలు అన్ని అవాస్తవమని చిరు స్పష్టం చేశారు.



సంబంధిత వార్తలు