Music Director Raj Passes Away: టాలీవుడ్‌లో తీరని విషాదం, హిట్ మ్యూజిక్ డైరక్టర్ రాజ్ కన్నుమూత, రాజ్-కోటీ ద్వయంలో హిట్స్ ఇచ్చిన సంగీత దర్శకుడు
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో ఆయన హఠాణ్మరణం చెందారు. రాజ్ అసలు పేరు తోటకూర సోమరాజు. ఆయన ప్రముఖ సంగీత దర్శకుడు టీవీ రాజు తనయుడు. (Raj Passes Away) రాజ్ మరో ప్రముఖ సంగీత దర్శకుడు కోటితో (Koti) కలిసి ఎన్నో చిత్రాలకు పని చేశారు.
Hyderabad, May 21: ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ (Music Director Raj) (68) ఆదివారం కన్నుమూశారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో ఆయన హఠాణ్మరణం చెందారు. రాజ్ అసలు పేరు తోటకూర సోమరాజు. ఆయన ప్రముఖ సంగీత దర్శకుడు టీవీ రాజు తనయుడు. (Raj Passes Away) రాజ్ మరో ప్రముఖ సంగీత దర్శకుడు కోటితో (Koti) కలిసి ఎన్నో చిత్రాలకు పని చేశారు. రాజ్-కోటి కాంబినేషనల్‌లో ఎన్నో చిత్రాలకు సంగీతం అందించి.. సినీ సంగీత అభిమానులను ఊర్రూతలూగించారు. దాదాపు 180 చిత్రాలకు ఇద్దరు కలిసి సంగీత దర్శకత్వం వహించగా.. 3వేలకుపైగా పాటలకు స్వరాలు సమకూర్చారు. ప్రళయ గర్జన చిత్రంతో రాజ్-కోటి (Raj Koti) ద్వయం సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించారు.
యముడికి మొగుడు, లంకేశ్వరుడు, ముఠా మేస్త్రి, బాలగోపాలుడు, బంగారు బుల్లోడు, హలో బ్రదర్, అన్న తమ్ముడు విజయవంతమైన చిత్రాలకు స్వరాలు సమకూర్చారు. హలో బద్రర్ సినిమాకు నంది పురస్కారం అందుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు. విడిపోయిన తర్వాత రాజ్ ఎక్కువ చిత్రాలు చేయలేదు. రాజ్ ఒక్కడే చేసిన సినిమాల్లో సిసింద్రీ, రాముడొచ్చారు. చిన్నిచిన్ని ఆశ తదితర చిత్రాలకు స్వరాలు అందించాడు. రాజ్‌కు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. రాజ్ మృతితో తెలుగు సినిమా పరిశ్రమలో విషాదం అలుముకున్నది. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.