NTR’s 100th Anniversary: పవన్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, వెంకటేశ్, కల్యాణ్ రాం.. ఎన్టీఆర్ శత జయంతి సభకు కదిలిరానున్న తారాలోకం.. రాజకీయ అతిరథులు కూడా.. హైదరాబాద్ లో రేపే సభ
హైదరాబాద్‌లో రేపు జరగనున్న ఎన్టీఆర్ శత జయంతి సభకు అగ్రశ్రేణి సినీతారలు, వామపక్ష, బీజేపీ పార్టీ ప్రముఖులు హాజరుకానున్నారని శత జయంతి కమిటీ కన్వీనర్ మీడియాకు తెలిపారు.
Hyderabad, May 19: హైదరాబాద్‌లో (Hyderabad) రేపు జరగనున్న ఎన్టీఆర్ శత జయంతి సభకు (NTR’s 100th Anniversary) అగ్రశ్రేణి సినీతారలు (Movie Celebrities), వామపక్ష, బీజేపీ పార్టీ ప్రముఖులు హాజరుకానున్నారని శత జయంతి కమిటీ కన్వీనర్ మీడియాకు తెలిపారు. కూకట్‌పల్లి (Kukatpally) హాసింగ్ బోర్డును ఆనుకొని ఉన్న కైతలాపూర్ మైదానంలో సాయంత్రం 5 గంటలకు ఈ సభ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు జీవిత విశేషాలతో ‘శకపురుషుడు’ పేరుతో ఓ ప్రత్యేక సంచికను కూడా సభలో ఆవిష్కరిస్తారు. ఇక ఎన్టీఆర్ సినీ, జీవిత విశేషాలున్న ‘జై ఎన్టీఆర్’ వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభిస్తారు.
రాబోతున్న ప్రముఖులు వీరే
పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, వెంకటేశ్, కల్యాణ్ రాం, జయప్రద, మురళీ మోహన్, రాఘవేంద్రరావు, జీ. ఆదిశేషగిరిరావు, అశ్వనీదత్, సుమన్, కన్నడ సినీ హీరో శివ రాజకుమార్, సీపీఎం, సీపీఐ జాతీయ కార్యదర్శులు సీతారం ఏచూరీ, డీ.రాజా, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరీ తదితరులు ఈ సభకు హాజరుకానున్నారు.