Hyderabad, May 19: ఎండలతో సతమతమవుతున్న తెలంగాణ (Telangana) వాసులకు ఓ గుడ్‌న్యూస్ (Good news). నేడూ, రేపు రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు (Rains) కురవనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు మధ్యప్రదేశ్ (Eastern Madhyapradesh) నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని వెల్లడించింది. ఫలితంగా, రాష్ట్రంలోని దక్షిణ ప్రాంత జిల్లాల్లో నేడూ, రేపూ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
ఏపీలో ఇలా..
ఇక భానుడి భగభగలతో ఏపీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలకు వేడిగాలులు తోడవుతుండటంతో ఎండ తీవ్రత మరింత పెరిగింది. గురువారం ఎస్‌పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరులో గరిష్ఠంగా 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. శ్రీకాకుళం, పల్నాడు, వైఎస్సార్ జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రజలు అప్రమత్తతతో ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.