Prithviraj Sukumaran: పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పై వైరల్ న్యూస్.. ఈడీకి రూ.25 కోట్లు ఫైన్‌ కట్టాడంటూ వార్తలు.. వెటరన్ నటుడి స్పందన ఏంటంటే?

దీంతో ఆయన ఈడీకి రూ.25 కోట్ల ఫైన్‌ చెల్లించారని తాజాగా మరునాడన్ మలయాళీ అనే యూట్యూబ్‌ ఛానెల్‌ వార్తలు దర్శనమిచ్చాయి.

Prithviraj Sukumaran (Credits: Twitter)

Hyderabad, May 12: నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran)కు సంబంధించిన ఓ వార్త చర్చనీయాంశంగా మారింది. పశ్చిమాసియాకు (Western Asia) చెందిన కొందరు వ్యక్తుల నుంచి పృథ్వీరాజ్‌ డబ్బులు తీసుకుని ప్రచార చిత్రాలు (Promotional Movies) నిర్మిస్తున్నారని.. దీంతో ఆయన ఈడీకి రూ.25 కోట్ల ఫైన్‌ చెల్లించారని తాజాగా మరునాడన్ మలయాళీ అనే యూట్యూబ్‌ ఛానెల్‌ వార్తలు దర్శనమిచ్చాయి. ఈ నేపథ్యంలో తనపై వస్తోన్న ఈ ఆరోపణల గురించి పృథ్వీరాజ్‌ ట్విటర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన సమాచారం లేకుండా తన పరువుకు భంగం కలిగించేలా ఇలాంటి వార్తలు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు అవసరమైన న్యాయప్రకియను ప్రారంభిస్తానని తెలిపారు.

Hema Malini on Allu Arjun: అల్లు అర్జున్‌ను చూసి నేర్చుకోండి.. బాలీవుడ్ హీరోలకు హేమా మాలిని క్లాస్

Poonam Kaur: పవన్‌ కాళ్ల కింద ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ పేరు, ఇది అహంకారమా? లేక అజ్ఞానమా అంటూ మండిపడిన హీరోయిన్ పూనమ్ కౌర్, ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌

ప్రభాస్ చిత్రంలో..

'అయ్యప్పనమ్‌ కోషియం', 'బ్రో డాడీ', 'లూసిఫర్‌', 'డ్రైవింగ్‌ లైసెన్స్‌', 'జనగణమన' వంటి విభిన్న కంటెంట్ ఉన్న సినిమాలతో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రభాస్‌ నటిస్తోన్న 'సలార్‌'లో పృథ్వీరాజ్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు.