Pushpa-2 Collections: బాక్సాఫీస్ వద్ద పుష్ప రాజ్ సందడి.. తొలిరోజు మొత్తం కలెక్షన్స్ ఎంతంటే?? ఏ భాషలో ఎన్ని వసూళ్లు దక్కించుకుందంటే??
ప్రీమియర్ షోల నుంచే ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.
Hyderabad, Dec 6: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప-2 సినిమా (Pushpa-2 Collections) అన్ని భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. ప్రీమియర్ షోల నుంచే ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక మొదటి రోజు పుష్ప ఎంత వసూల్ చేసిందని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా తొలి రోజు వసూళ్లతో పుష్ప 2 అన్ని రికార్డ్స్ ను బద్దలు కొట్టింది. డిసెంబర్ 4న చాలా చోట్ల ఈ సినిమా ప్రీమియర్ షోలు వేశారు. ప్రీమియర్ షోల ద్వారా సినిమాకు రూ. 10 కోట్లు రాబట్టింది. డిసెంబర్ 5న ఈ సినిమా రూ.165 కోట్లు వసూలు చేసింది. దీని ద్వారా సినిమా మొత్తం వసూళ్లు రూ. 175 కోట్లుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.
అల్లు అర్జున్ పై కేసు నమోదు, మహిళ మృతిపై నిర్లక్ష్యం విషయంలో పోలీసుల సీరియస్ యాక్షన్
తొలి రోజు వసూళ్లు ఇలా..
- మొత్తం వసూళ్లు - రూ.175 కోట్లు
- తెలుగు వెర్షన్ - రూ.95.1 కోట్లు
- హిందీ వెర్షన్ - రూ.67 కోట్లు
- తమిళ వెర్షన్ - రూ.7 కోట్లు
- మలయాళం వెర్షన్ - రూ.5 కోట్లు
- కన్నడ వెర్షన్ - రూ.1 కోటి