Rana Naidu: రానా నాయుడు, బూతు సిరీస్ అంటూనే తెగ చూసేస్తున్న నెటిజన్లు, ఇప్పటివరకు 8 మిలియన్లకు పైగా వ్యూస్, ఓటీటీ ఫ్లాట్ ఫాంలో నంబర్ వన్‌‌ ఇదే

అశ్లీలత, అసభ్యత, మితిమీరిన శృంగారం లాంటి అంశాలతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌ (Rana Naidu) విమర్శల మధ్యనే ట్రెండింగ్ లో దూసుకుపోతోంది.

Rana Naidu Poster (Photo Credits: Twitter)

విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు OTT ఫ్లాట్ ఫాంని షేక్ చేస్తోంది. అశ్లీలత, అసభ్యత, మితిమీరిన శృంగారం లాంటి అంశాలతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌ (Rana Naidu) విమర్శల మధ్యనే ట్రెండింగ్ లో దూసుకుపోతోంది.

మార్చి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది. అయితే తెలుగు ప్రేక్షకులు దీనిపై పెదవి విరిచిన రానా నాయుడు ఓటీటీలో రికార్డు వ్యూస్ (Rana Naidu creates a sensation) సాధిస్తున్నది.ఈ సినిమా చిత్రం గత వారం రోజుల్లో 8 మిలియన్లకుపైగా వ్యూస్ సాధించడమే కాకుండా రికార్డు వైపు దూసుకెళ్తున్నది.

రానా నాయుడు ఇండియాలో దుమ్ము రేపిందిగా, నంబర్ వన్ షోగా ట్రెండింగ్‌లో వెబ్ సిరీస్, వర్మకు థ్యాంక్స్ చెబుతూ నెటిజన్లకు సారి చెప్పిన రానా

రానా నాయుడు వెబ్ సిరీస్‌ను కరణ్ అన్షుమన్, సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహించారు. అమెరికాలో పాపులర్ టీవీ సిరీస్ రే డోనోవ్యాన్ ను రానా నాయుడుగా తెరకెక్కించారు. రానా, వెంకటేష్‌తోపాటు సుచిత్రా పిళ్లై, గౌరవ్ చోప్రా, సుర్వీన్ చావ్లా కీలక పాత్రల్లో నటించారు.టాలీవుడ్ ఇంతవరకు ఏ అగ్రహీరోలు కానీ...స్టార్‌ హీరోలు కానీ వెబ్ సిరీస్ లో నటించలేదు. ఫస్ట్ టైమ్ దగ్గుబాటి హీరోలు విక్టరీ వెంకటేశ్‌.. రానా కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్ లో నటించారు.

తెలుగు హీరోలు ఇద్దరు కలిసి నటించిన వెబ్ సిరీస్ కావటంతో రానా నాయుడుకి మంచి హైప్ క్రియేట్ అయింది. ఇక వెంకటేశ్‌ ను ఇష్టపడే ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఈ వెబ్ సిరీస్ చూడటానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఈ వెబ్ సిరీస్ లో వెంకటేశ్‌ తనకున్న ఫ్యామిలీ ఇమేజ్ కు భిన్నంగా ప్లే బాయ్ రోల్ లో కనిపించాడు. ఇక సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌లో వెంకీ మేన‌రిజ‌మ్స్‌ ఆకట్టుకున్నా...బూతులు మాట్లాడటం టాలీవుడ్ ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేకపోయారు.ఈ సిరీస్ ఇంతలా హాట్ టాపిక్ గా మారడానికి మెయిన్ రీజన్ వెంకటేశ్‌ పచ్చి బూతులు మాట్లాడడమే. వెంకీ తన కెరీర్ లో ఏ సినిమాలో కూడా ఇలాంటి బూతులు మాట్లాడలేదు.

సినీ పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ నటుడు సమీర్ ఖాఖర్ కన్నుమూత, మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కారణంగా తిరిగిరాని లోకాలకు

పరిస్థితి అర్ధం చేసుకున్న రానా రంగంలో దిగాడు. సిరీస్ ను మెచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే నచ్చని వారికి తన హృదయపూర్వకంగా క్షమాపణలు తెలియజేశారు. రానా నాయుడు వెబ్ సిరీస్ పై మొదట్లో నెగిటివ్ రివ్యూస్ వచ్చినా ...ఇప్పుడు టాక్‌ మెల్లగా మారుతోంది.కొంతమంది యూత్ ఈ అడల్ట్ కంటెంట్ ని బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు.

ఇక ఈ అడల్ట్ కంటెంట్ లో వెంకటేశ్‌ నటించేందుకు ఒప్పుకోవడానికి కూడా కారణం నెట్ ఫ్లిక్స్ సంస్థ అందించిన భారీ రెమ్యూనరేషన్ అని తెలుస్తుంది. ఈ సిరీస్ లో నటించేందుకు వెంకటేష్‌ 12 కోట్ల రూపాయిలు తీసుకున్నాడట. అలాగే రానా కి 8 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు సమాచారం. వీళ్ల కెరీర్ లో బిగ్గెస్ట్ రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడం వల్లే ఈ బోల్డ్ కంటెంట్ రోల్ లో నటించడానికి ఒప్పుకున్నట్టు సమాచారం.

ఇదిలి ఉంటే రానా నాయుడు తెలుగు వెబ్ సిరీస్ కాదు. హిందీలో తీసి దాన్ని తెలుగులో డబ్ చేశారు. రానా నాయుడు నిదానంగానే ప్రారంభమైన వెళ్లే కొద్దీ స్క్రీన్ ప్లే రేసీగా మారుతుంది. ఇదే ఇప్పుడు రానా నాయుడు వెబ్ సిరీస్ ను ట్రెండింగ్ లో నిలబెట్టిందని కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.