Ranveer Singh in Pushpa 2: 'పుష్ప-2'లో రణ్‌వీర్‌సింగ్‌?.. పోలీసాఫీసర్‌గా ప్రత్యేక పాత్ర

తాజా సమాచారం ప్రకారం 'పుష్ప-2' చిత్రంలో బాలీవుడ్‌ టాప్‌ హీరో రణ్‌వీర్‌సింగ్‌ అతిథి పాత్రలో నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Ranveer, Allu Arjun (Credits: Twitter)

Hyderabad, May 23: పాన్ ఇండియా (Pan India) రేంజ్ లో గత కొన్ని రోజులుగా సక్సెస్ (Success) రుచి చూస్తున్న తెలుగు చిత్రాల్లో (Telugu Movies) నటించడానికి బాలీవుడ్‌ అగ్ర హీరోలు (Bollywood Heros) ఆసక్తిని ప్రదర్శి స్తున్నారు. తాజా సమాచారం ప్రకారం 'పుష్ప-2' (Pushpa 2) చిత్రంలో బాలీవుడ్‌ టాప్‌ హీరో రణ్‌వీర్‌సింగ్‌ అతిథి పాత్రలో నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో అల్లు అర్జున్‌ను పరిచయం చేసే పోలీసాఫీసర్‌గా రణ్‌వీర్‌సింగ్‌ కనిపిస్తారని సమాచారం. నిడివి చిన్నదే అయినా కథాగమనంలో ఆయన పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని చెబుతున్నారు.

Ray Stevenson Dies: ఆర్ఆర్ఆర్ నటుడు రే స్టీవెన్సన్ కన్నుమూత.. థోర్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న రే స్టీవెన్సన్

మహేష్‌ సినిమా అక్షయ్

సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న 'పుష్ప-2' ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఇదిలావుండగా మహేష్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాలో బాలీవుడ్‌ అగ్ర నటుడు అక్షయ్‌కుమార్‌ అతిథి పాత్రల్లో కనిపించనున్నారని ప్రచారం జరుగుతున్నది.

Rs. 2000 Note Withdrawn: నేటి నుంచి రూ. 2000 నోటు మార్పిడి షురూ.. 55 వేల బ్యాంక్‌ బ్రాంచీలు రెడీ.. రోజుకు ఎన్ని మార్చుకోవచ్చంటే??