Hyderabad, May 23: దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) రూపొందించిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాలో ప్రతినాయకుడిగా దేశప్రజలకు సుపరిచితమైన ఐరిష్ నటుడు రే స్టీవెన్సన్ (Ray Stevenson) కన్నుమూశారు. ఆయన హఠాన్మరణానికి కారణమేంటో ఇంకా తెలియరాలేదు. థోర్ (Thor) సినిమా సీరిస్‌తో ఆయన ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయ్యారు. ఆయన మరణవార్తపై ఆర్ఆర్ఆర్ బృందం సంతాపం తెలిపింది. ఈ వార్త తమను షాక్‌కు గురిచేసిందని ట్వీట్ చేసింది. రే స్టీవెన్సన్ ఆత్మకు శాంతి చేకూరాలని తెలిపింది. స్టీవెన్సన్ మృతిపై ఆయన ఆత్మీయులు, శ్రేయోభిలాషులు సంతాపం తెలియజేశారు. స్టీవెన్సన్ నార్త్ ఐర్లాండ్‌లో 1964 మే 25న జన్మించారు. బ్రిటీష్ ఓల్డ్ వీక్ థియేటర్‌లో నటనలో శిక్షణ పొందారు. రే స్టీవెన్సన్ చివరిగా నటించిన ‘డిస్నీ అషోకా’ సిరీస్ త్వరలో విడుదల కానుంది.
Ray Stevenson has sadly passed away at the age of 58. pic.twitter.com/mQKxENuwmG
— DiscussingFilm (@DiscussingFilm) May 22, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)