Sonu Sood Ambulance Service: ట్యాంక్‌బండ్ శివను కలిసిన సోనూ సూద్, సోనూసూద్ అంబులెన్స్ సర్వీస్ ని ప్రారంభించిన రియల్ హీరో, తాను ఉన్నానంటూ భరోసా
సోనూసూద్ చేస్తున్న సేవలను చూసి ఆయనకు అభిమానులుగా మారిన వారెందరో ఉన్నారు. అందులో కొందరు తమ అభిమానాన్ని చాటుకుంటూ తమ షాపులకు సోనూసూద్ పేరు పెట్టుకుంటున్నారు.
Hyderbad, Jan 19: కోవిడ్ సమయంలో బస్సులు, ట్రైన్స్, విమానాలతో వలస కార్మికులను వారి గమ్య స్థానాలు చేర్చడంతో పాటు ఎందరో ఆపన్నులకు అండగా నిలబడి రియల్ హీరోగా మారిన వ్యక్తి సోనూసూద్ గురించి పరిచయం అక్కరలేదు. సోనూసూద్ చేస్తున్న సేవలను చూసి ఆయనకు అభిమానులుగా మారిన వారెందరో ఉన్నారు. అందులో కొందరు తమ అభిమానాన్ని చాటుకుంటూ తమ షాపులకు సోనూసూద్ పేరు పెట్టుకుంటున్నారు.
మన తెలుగు రాష్ట్రానికి చెంది ఓ వ్యక్తి సోనూసూద్ (Sonu Sood) కోసం గుడి కూడా కట్టేశాడు . తాజాగా హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ శివ అనే వ్యక్తి సోనూ సూద్ అంబులెన్స్ సర్వీస్ పేరుతో అంబులెన్స్ సేవలను ప్రారంభించాడు. తెలుగు రాష్ట్రాల్లో వైద్య సదుపాయం అందుబాటులో లేని మారుమూల ప్రాంతాలకు ఈ అంబులెన్స్ సర్వీసుతో ప్రజలకు సేవలు అందిస్తారు. సోనూసూద్ ఈ సర్వీస్‌ను మంగళవారం లాంచ్ చేశాడు.
ఢిల్లీని ఢీకొట్టిన మొనగాడు, నందమూరి తారకరామారావు సినీ జీవితం, రాజకీయ జీవితంపై ప్రత్యేక కథనం
ట్యాంక్‌బండ్‌పై ప్రమాదవశాత్తు మరణించి, ఆత్మహత్య చేసుకున్నవారి మృతదేహాలను వెలికితీస్తూ ప్రజల హృదయాల్లో శవాల శివ స్థానం సంపాదించుకున్నాడు. ప్రజలు ఇచ్చిన విరాళాలతో అంబులెన్స్ కొనుగోలు చేసిన శివ.. దానికి ‘సోనూసూద్ అంబులెన్స్ సర్వీస్’(Sonu Sood Ambulance Service) అని పేరుపెట్టి సేవలు అందిస్తున్నాడు. ఈ అంబులెన్స్ ప్రారంభోత్సవానికి రావాలని సోనూసూద్‌ని ఆహ్వానించాడు శివ. శవాల శివ చేస్తున్న సేవలను మెచ్చుకున్న సోనూసూద్ నేరుగా అతని దగ్గరకే వచ్చారు.
మంగళవారం ట్యాంక్‌బండ్‌కు వెళ్లిన సోనూసూద్.. శవాల శివ ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్ చేశాడు. శివ చేస్తున్న సేవలను సోనూసూద్ ప్రశంసించారు. భవిష్యత్తులో ఏమి కావాలన్న తాను ఉన్నానని శివకు భరోసా ఇచ్చాడు. ఇక ఈ అంబులెన్స్ సేవలను విస్తృతం చేస్తామని సోనూసూద్ చెప్పాడు.