Jabardasth Mukku Avinash: చేతిలో డబ్బులు లేక చచ్చిపోవాలనుకున్న జబర్దస్త్ అవినాష్, మల్లెమాల అగ్రిమెంట్ రద్దు చేయాలంటే పది లక్షలు కట్టాలంటూ కన్నీళ్లు

కష్టపడి సొంత ఇంటిని నిర్మించుకున్న తర్వాత అతని తల్లిదండ్రులు ఒక్కసారిగా అనారోగ్యం పాలవడంతో ఎంతో కష్టపడి వారికి వైద్యం చేయించాడు.

Jabardasth Mukku Avinash (Photo-Twitter)

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ముక్కు అవినాష్ తన కామెడీతో ప్రేక్షకులను అలరించి కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. తన కామెడీ ద్వారా ప్రేక్షకులను నవ్వించి వారి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. జబర్దస్త్ లో స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న అవినాష్ (Jabardasth Mukku Avinash) ఇంత కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి సొంత ఇంటిని నిర్మించుకున్నాడు. కొన్ని నెలల క్రితం అవినాష్ పెళ్లి చేసుకొని భార్యతో సంతోషంగా జీవనం సాగిస్తున్నాడు.

ఒకానొక సమయంలో అవినాష్ ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని (Emotional Comments ) నిర్ణయించుకున్నాడు. కష్టపడి సొంత ఇంటిని నిర్మించుకున్న తర్వాత అతని తల్లిదండ్రులు ఒక్కసారిగా అనారోగ్యం పాలవడంతో ఎంతో కష్టపడి వారికి వైద్యం చేయించాడు. ఆ సమయంలో చేతిలో రూపాయి లేకపోవడంతో అయిన వారి నుండి సాయం కోసం ఎదురుచూసిన కూడా ఎటువంటి ఫలితం లేకపోయింది. పైగా అదేసమయంలో కరోనా లాక్డౌన్ కారణంగా టీవీ షో లు లేకపోవటంతో ఆర్థిక ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయి.

నన్ను వయసు పేరుతో ఘోరంగా అవమానించారు, అందుకే జబర్దస్త్ నుంచి తప్పుకున్నాను, సంచలన విషయాలు వెల్లడించిన కమెడియన్ అప్పారావు

కష్ట సమయంలో ఆప్తుల నుండి సాయం ఆశించి ఫలితం లేకపోవడంతో జీవితం మీద విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత మాటీవీలో ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో లో పాటిస్పేట్ చేసి అక్కడ కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ సమయంలో అవినాష్ అగ్రిమెంట్ అడ్డు వచ్చింది.మల్లెమాల అగ్రిమెంట్ రద్దు చేయాలంటే పది లక్షలు కట్టాల్సి ఉంటుంది. ఆ సమయంలో జబర్దస్త్ యాజమాన్యానికి 10 లక్షల రూపాయలు డబ్బులు చెల్లించి మరీ బిగ్ బాస్ షో లో పాటిస్పేట్ చేశాడు.

దీంతో అవినాష్ ఆ డబ్బును శ్రీముఖి వద్ద అప్పుగా తీసుకున్నాడు. మొత్తానికి అవినాష్ మాత్రం ఆ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చాడు. బిగ్ బాస్ షోలోకి వచ్చాడు. అక్కడ పదే పదే కూడా ఈ అగ్రిమెంట్ గురించి చెప్పడం, తన కష్టాలు వివరించడం, లాక్డౌన్‌‌లో సూసైడ్ చేసుకోవాలనుకున్నానంటూ చెప్పడం అందరికీ తెలిసిందే. కరోనా, లాక్డౌన్ వంటివి వస్తాయ్.. షోలు రద్దు అవుతాయ్.. షూటింగ్‌లు ఉండవు అని ఆలోచించని అవినాష్.. అప్పు తెచ్చి, బ్యాంకు లోని తీసుకుని ఇంటిని కట్టేశాడు.

మొత్తానికి బిగ్ బాస్ షో ద్వారా 50 లక్షలు సంపాదించేశాడు. దాంతో అప్పులన్నీ తీరిపోయాయ్. మళ్లీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసేశాడు. స్టార్ మాలోనే కామెడీ స్టార్స్ అంటూ చేసుకుంటూ వస్తున్నాడు.ఇదే విషయాన్ని తాజాగా ఇస్మార్ట్ జోడిలో అవినాష్‌ గుర్తు చేసుకున్నాడు. అవినాష్ చాలా గ్రేట్ అంటూ ఓంకార్ అన్ని విషయాలను గుర్తు చేశాడు. దీంతో కంటతడి పెట్టేసిన అవినాష్.. నాకు స్టార్ మానే కొత్త జీవితాన్ని ఇచ్చిందంటూ మోకాళ్ల మీద పడిపోయాడు. కన్నీరు పెట్టేసుకున్నాడు. అవినాష్ పెళ్లి చేసుకున్న తర్వాత తన భార్యతో కలిసి ఇటీవల మాటీవీలో ప్రసారం అవుతున్న ఇస్మార్ట్ జోడి2 లో (Ishmart Jodi Season 2) పార్టిసిపెట్ చేస్తున్నాడు.