జబర్దస్త్' కామెడీ షోతో పాపులర్ అయిన కమెడియన్లలో అప్పారావు (Jabardasth Appa Rao) ఒకరు. అయితే ఈ మధ్య కొంతకాలంగా ఆయన ఆ షోలో కనిపించడం లేదు. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'ఆ షోలో 7-8 సంవత్సరాలుగా ఉన్నాను. షూటింగులకు ఒక్కరోజు కూడా డుమ్మా కొట్టకుండా వెళ్లేవాడిని. కానీ కరోనా సెకండ్ వేవ్ తర్వాత నా వయసును దృష్టిలో పెట్టుకొని మేనేజ్‌మెంట్ కొంతకాలం వెయిట్ చేయమన్నారు.
కానీ ఆ తర్వాత వాళ్లు నన్ను పిలవలేదు. చెప్పుడు మాటలు విని నా పేరును హోల్డ్ లో పెట్టారు. స్కిట్స్‌లో అంతగా ప్రాధాన్యత లేని పాత్రలు కూడా చేశాను. ఒకప్పుడు టీమ్ లీడర్‌గా చేసిన నేను ఆ తర్వాత కాలంలో ఒక కంటెస్టెంట్‌కు ఇచ్చిన గుర్తింపు కూడా నాకు వారు ఇవ్వలేదు. ఆ షోలో సీనియర్‌ని అయినప్పటికీ నాకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. అలా నన్ను పరోక్షంగా అవమానించారు. అందుకే తప్పుకోవాల్సి (why He left Comedy Show ) వచ్చింది. వెళ్లేటప్పుడు కూడా కనీసం ఎందుకు వెళ్తున్నారని ఒక్క మాట కూడా అడగలేదు. ఏదైతేనేం, ఇప్పుడు మరో కామెడీ షో చేస్తున్నాను. డబుల్ పేమెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు నా పరిస్థితి బాగుంది అని ఆ ఇంటర్యూలో చెప్పుకొచ్చారు.