Priyanka-Shiva: తిరుమలలో ప్రాంక్ వీడియోపై క్షమాపణలు చెప్పిన ప్రియాంకజైన్, శివ (వీడియో)
తాము శ్రీవారికి పరమ భక్తులమంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు.
Hyderabad, Dec 3: తిరుమలలో (Tirumala) చేసిన ప్రాంక్ వీడియోపై బిగ్ బాస్ (Bigboss) కంటె స్టెంట్ ప్రియాంకజైన్ (Priyanka Jain), శివకుమార్ (Shiva Kumar) లు క్షమాపణలు చెప్పారు. తాము శ్రీవారికి పరమ భక్తులమంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఎవరి మనోభావాల్ని దెబ్బతీయాలని గానీ, ఇతర ఏవిధమైన ఆలోచనలు లేవని క్లారిటీ ఇచ్చారు. అనుకొకుండా జరిగిన సంఘటన అని కూడా వీరిద్దరు చెప్పుకొచ్చారు. జరిగిన ఘటన పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నామని, చేతులు జోడించి.. టీటీడీకి, శ్రీవారి భక్తులకు, హిందు సంఘాలకు సారీ చెప్తున్నామని.. ఇలాంటి తప్పిదాలు మరెప్పుడు కూడా.. జరక్కుండా చూస్తామని కూడా ప్రియాంక జైన్, శివలు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Here's Video:
ఏమిటీ వివాదం?
ప్రియాంకజైన్, శివకుమార్ లు ఇటీవల తిరుమల నడక మార్గంలో.. ఏడో మైలురాయి వద్ద పులి అంటూ ప్రాంక్ వీడియోలు తీశారు. ఇది కాస్త వైరల్ గా మారింది. దీనిపై భక్తులు సహా టీటీడీ సైతం సీరియస్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే వాళ్లు క్షమాపణలు చెప్పినట్టు తెలుస్తోంది.