India

Lemon Tea Benefits: రోజూ లెమన్ టీ తాగేవారు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు, ఈ పదార్థాలతో కలిసి తాగితే ప్రమాదమే, ఈ ఆహార పదార్థాలను తాగే సమయంలో దూరంగా ఉంచండి

Team Latestly

లెమన్ టీని ప్రతిరోజూ తాగే వాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఉదయం లేచిన వెంటనే ఒక వేడి నిమ్మ టీ తాగితే శరీరానికి తేలికపాటిగా అనిపించడం, జీర్ణక్రియను మెరుగుపర్చడం, బరువు తగ్గడంలో సహకరించడం వంటి అనేక ప్రయోజనాలుంటాయి.

Saudi Arabia Bus Accident: సౌదీ అరేబియా ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి, భారత యాత్రికుల బస్సును ఢీకొట్టిన డీజిల్ ట్యాంకర్, 45 మంది సజీవ దహనం

Team Latestly

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత యాత్రికులతో వెళుతున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో అందరూ నిద్రలో ఉండటంతో 45 మంది సజీవ దహనమయ్యారు.

Saudi Arabia Bus Accident: ఎంత విషాద ఘటన ఇది.. ఒకే కుటుంబంలో 18 మంది మృతి, సౌదీ రోడ్డు ప్రమాదంలో 45 మంది హైదరాబాద్ వాసులు దుర్మరణం, మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

Team Latestly

తెలంగాణలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. సౌదీ అరేబియాలో జరిగిన ఘోర ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన 45 మంది ఉమ్రా యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ వివరాలను తెలంగాణ హజ్ కమిటీ అధికారిక ప్రకటనలో నిర్ధారించింది. పవిత్రమైన ఉమ్రా యాత్ర ముగించుకుని మదీనాకు వెళ్తున్న ఈ యాత్రికుల ప్రయాణం అకస్మాత్తుగా విషాదంగా మారింది.

Electric Car Fire Video: వీడియో ఇదిగో, ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో ఎలక్ట్రిక్ కారులో అకస్మాత్తుగా మంటలు, అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలి బూడిదైన కారు

Team Latestly

హైదరాబాద్ లోని నారాయణగూడ పరిధిలోని ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఓ ఎలక్ట్రిక్ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి కలకలం సృష్టించాయి. ఈ అగ్నిప్రమాదంలో కారు పూర్తిగా కాలి బూడిదైంది. మంటల తీవ్రతకు సమీపంలో పార్క్ చేసి ఉన్న మరో కారు కూడా పాక్షికంగా దెబ్బతింది.

Advertisement

Sheikh Hasina Gets Death Penalty: బంగ్లాదేశ్ మాజీ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష, ఆమెను వెంటనే మాకు అప్పగించాలని భారత్‌ను కోరిన బంగ్లాదేశ్ ప్రభుత్వం

Team Latestly

సోమవారం, నవంబర్ 17న బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒక కీలక డిమాండ్‌ను భారతదేశానికి అధికారికంగా పంపింది. గత సంవత్సరంలో విద్యార్థుల ఉద్యమాన్ని అణచివేయడంలో పాత్ర పోషించినందుకు ఉరిశిక్ష విధించబడిన మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా, మాజీ గృహ మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్ లను భారత్ అప్పగించాలని ఢాకా కోరింది.

Mokama Assembly Election Result 2025: బీహార్‌ దూసుకుపోతున్న ఎన్డీయే, 200కు పైగా స్థానాల్లో ఆధిక్యం, మోకామాలో జైలుకెళ్లిన జెడియు నాయకుడు అనంత్ సింగ్ భారీ విజయం

Team Latestly

జైలు శిక్ష అనుభవిస్తున్న జెడియు బలమైన నాయకుడు అనంత్ సింగ్ మోకామాలో భారీ విజయం సాధించారు, ఆర్జెడి అభ్యర్థి వీణా దేవి 63,210 ఓట్లపై 91,416 ఓట్లు సాధించి దాదాపు 30,000 ఓట్ల తేడాతో గెలిచారు . ప్రస్తుతం జాన్ సురాజ్ పార్టీ (జెఎస్పి) మద్దతుదారుడి హత్య కేసులో జైలులో ఉన్న సింగ్, చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ తన ఆధిపత్యాన్ని కొనసాగించారు.

Data Privacy Rules: మూడేళ్లు వాడకపోతే యూజర్ డేటా డిలీట్, అమల్లోకి వచ్చిన కీలక నిబంధనలు గురించి తెలుసుకోండి, డేటా డిలీట్ చేసే ముందు యూజర్‌కు 48 గంటల నోటీసు

Team Latestly

డిజిటల్ యుగంలో వ్యక్తిగత సమాచార భద్రతకు పెరుగుతున్న ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని, భారత ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశ చరిత్రలో తొలి సమగ్ర డిజిటల్ గోప్యతా చట్టంగా పేరుగాంచిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) యాక్ట్’ కింద కేంద్ర ప్రభుత్వము కొత్త నిబంధనలను అధికారికంగా నోటిఫై చేసింది

Sex Assault Caught on Camera: షాకింగ్ వీడియో ఇదిగో, ప్రభుత్వ ఆసుపత్రిలో స్కాన్ కోసం వెళ్ళిన మహిళకు లైంగిక వేధింపులు, అక్కడ టచ్ చేస్తూ దారుణం..

Team Latestly

బెంగళూరు శివార్లలోని అనేకల్ నుండి లైంగిక వేధింపుల కేసు వెలుగులోకి వచ్చింది. ప్లాస్మా మెడినోస్టిక్స్‌లో స్కాన్ చేస్తున్నప్పుడు రేడియాలజిస్ట్ తన ప్రైవేట్ భాగాలను తాకాడని 34 ఏళ్ల మహిళ ఆరోపించిన తర్వాత ఈ షాకింగ్ లైంగిక వేధింపుల కేసు బయటపడింది.

Advertisement

Jubilee Hills Bypoll Result: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం, మాగంటి సునీతపై భారీ మెజార్టీతో విజయం సాధించిన నవీన్ యాదవ్, బీజేపీకి డిపాజిట్ గల్లంతు

Team Latestly

తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మక నియోజకవర్గాల్లో ఒకటైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రారంభం నుంచి చివరి రౌండ్ వరకు ఆధిక్యాన్ని కొనసాగిస్తూ, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,658 ఓట్ల తేడాతో భారీ మెజార్టీతో విజయం సాధించారు.

Telangana Weather: తెలంగాణలో 8.2 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు, రాష్ట్రంలోని 29 జిల్లాల్లో పెరిగిన చలి తీవ్రత, రానున్న మూడు రోజుల్లో మరింత పెరగనున్న చలి

Team Latestly

రాష్ట్రంలో చలి మరింత తీవ్రమైంది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో ప్రజలు గజగజ వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా అడవులు, కొండలు అధికంగా ఉన్న ఉత్తర తెలంగాణలో చలిగాలులు విరుచుకుపడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొండప్రాంతాలు మంచు ముసురుకున్నట్టుగా కనిపిస్తున్నాయి.

AI Love Story in Japan: టెక్నాలజీ హద్దులు దాటింది, తన సొంత AI భాగస్వామిని వివాహం చేసుకున్న జపాన్ మహిళ, కృత్రిమ మేధస్సుతో పెళ్లి వీడియో వైరల్

Team Latestly

కృత్రిమ మేధస్సు (AI) ప్రభావం వేగంగా పెరుగుతున్న ఈ యుగంలో, జపాన్‌కు చెందిన ఒక మహిళ తన AI వ్యక్తిత్వాన్ని వివాహం చేసుకోవడం అంతర్జాతీయంగా సంచలనంగా మారింది. 32 ఏళ్ల కానో అనే ఈ మహిళ తనకు ఎంతో సన్నిహితంగా మారిన ChatGPT ఆధారిత చాట్‌బాట్ వ్యక్తిత్వాన్ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ ప్రత్యేక వివాహ వేడుక జపాన్‌లోని ఒకాయమా నగరంలో ఈ వేసవిలో ఘనంగా జరిగింది.

Murder Attempt Caught on Camera: షాకింగ్ వీడియో ఇదిగో, హత్యాయత్నం కెమెరాలో రికార్డు, వేగంగా వస్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో దంపతులు, కుమారుడికి గాయాలు

Team Latestly

బెంగళూరులోని న్యూ బీఈఎల్‌ రోడ్డుపై చోటుచేసుకున్న భయానక ఘటన నగరాన్ని కుదిపేసింది. వేగంగా వస్తున్న కారు ఒక ద్విచక్ర వాహనాన్ని ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టిన ఘటనలో ఒక జంటవారి చిన్న కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్‌ అయింది.

Advertisement

SC on Delhi Air Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతపై సుప్రీంకోర్టు ఆందోళన, మాస్కులు కూడా సరిపోవని వెల్లడి, ప్రజలు పలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని ఆవేదన

Team Latestly

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు తీవ్రస్థాయికి చేరుతోంది. గాలి నాణ్యత సూచిక (Air Quality Index - AQI) ప్రమాదకర స్థాయిలో నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత వారం రోజులుగా ఢిల్లీలో AQI 400కు పైగానే నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

AP Weather Forecast: బంగాళాఖాతంలో నవంబర్ 17న కొత్త అల్పపీడనం, ఏపీకి మరోసారి మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరిక

Team Latestly

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో వాతావరణం మరింత చల్లగా మారింది. ఈ పరిస్థితుల్లోనే వాతావరణ శాఖ మరో కీలక హెచ్చరిక జారీ చేసింది.

Gujarat Blast: గుజరాత్‌లో భారీ పేలుడు, భరూచ్ జిల్లాలో ఔషధ కర్మాగారంలో బాయిలర్ పేలుడుతో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు మృతి, మరో 20 20 మందికి గాయాలు

Team Latestly

గుజరాత్‌లో భారీ పేలుడు సంభవించింది. గుజరాత్‌లోని భరూచ్ జిల్లాలో బాయిలర్ పేలుడు, ఆ తరువాత జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు కార్మికులు మరణించగా, 20 మంది గాయపడ్డారని వార్తా సంస్థ PTI తెలిపింది. గుజరాత్‌లోని భరూచ్ జిల్లాలోని ఒక ఔషధ కర్మాగారంలో ఈ సంఘటన జరిగింది. సయ్ఖా GIDC ప్రాంతంలో ఉన్న కర్మాగారంలో తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని ఒక అధికారి తెలిపారు.

Tamil Nadu: వీడియో ఇదిగో, కారు రన్నింగ్‌లో ఉండగా సైడ్‌ మిర్రర్‌ నుంచి పాము బయటకు, ఒక్కసారిగా షాక్ అయిన కారు డ్రైవర్

Team Latestly

తమిళనాడులో కారు రన్నింగ్‌లో ఉండగా.. సైడ్‌ మిర్రర్‌ నుంచి పాము (Snake) బయటకు వచ్చింది. ఇది గమనించిన కారు డ్రైవర్‌ ఒక్కసారిగా షాక్‌ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఓ వ్యక్తి కారులో ప్రయాణిస్తుస్తూ కొంత దూరం వెళ్లాక కారు సైడ్‌ మిర్రర్‌ (car side mirror)లోపల నుంచి చిన్న పాము బయటకు వచ్చింది.

Advertisement

Delhi Blast: ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు, వెలుగులోకి మరో సంచలన వీడియో, వాహనాలు నెమ్మదిగా కదులుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు

Team Latestly

దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట (Red Fort) వద్ద జరిగిన పేలుడు ఘటన (Delhi Blast) కొత్త మలుపు తిరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన మరో సీసీటీవీ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.

H1B Visa Policy 2025: అమెరికాకు టాలెంట్ ఉన్న విదేశీ ప్రతిభ అవసరం, మా దేశంలో అంత టాలెంట్ లేదు, హెచ్‌-1బీ వీసాలపై మళ్లీ యూటర్న్ తీసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌

Team Latestly

మన దగ్గర చాలా మంది ప్రతిభావంతులైన కార్మికులు ఉన్నారని విలేకరి ప్రశ్నించగా, ఆయన తక్షణమే లేదు, మన దగ్గర అంత ప్రతిభ లేదని స్పష్టంగా చెప్పారు. అమెరికా లోపల లభించే మానవ వనరులు పలు రంగాలలో సరిపడవని ఆయన అభిప్రాయపడ్డారు.

India's Disaster Statistics: భారత్‌‌ను అల్లకల్లోలం చేస్తున్న ప్రకృతి విపత్తులు, మూడు దశాబ్దాల్లో 430 ప్రకృతి విపత్తులు, 80 వేల మంది మృతి, 130 కోట్ల మందికి పైగా ప్రజలపై ఎఫెక్ట్

Team Latestly

ప్రకృతి విపత్తులు (Climate Disasters) ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ప్రాణ నష్టం, ఆర్థిక నష్టాలను కలిగిస్తున్నాయి. ఆకస్మిక వరదలు, భూకంపాలు, తుపానులు, కరువులు, హీట్‌వేవ్స్‌ వంటి విపత్తులు దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్రమైన దెబ్బ కొడుతున్నాయి.

Islamabad Blast: ఇస్లామాబాద్ హైకోర్టు సమీపంలో ఆత్మాహుతి బాంబు దాడి, 12 మంది మృతి, మరో 20 మందికి గాయాలు

Team Latestly

Advertisement
Advertisement