IPL Auction 2025 Live

Vijayawada Floods: వీడియో ఇదిగో, డేంజర్ జోన్‌లో ప్రకాశం బ్యారేజ్, భారీ పడవలు ఢీకొనడంతో 69వ నెంబర్ గేటు ధ్వంసం, వాహనాల రాకపోకలపై నిషేధం విధించిన పోలీసులు

ఫలితంగా ప్రకాశం బ్యారేజీ వరద ఉధృతి ఆల్ టైం రికార్డు స్ధాయిలో నమోదైంది. సోమవారం ఉదయం 125 సంవత్సరాల బ్యారేజ్ చరిత్రలో రికార్డ్‌ స్ధాయిలో కృష్ణమ్మకి వరద కొనసాగుతుంది.

Gate Balancing Weight at Prakasam Barrage Damaged, Second Highest Flood Discharge in 121 Years Reported

Vjy, Sep 2: ప్రకాశం బ్యారేజీలోకి వచ్చి చేరుతున్న వరద ఉధృతి గంటగంటకూ పెరుగుతోంది. ఫలితంగా ప్రకాశం బ్యారేజీ వరద ఉధృతి ఆల్ టైం రికార్డు స్ధాయిలో నమోదైంది. సోమవారం ఉదయం 125 సంవత్సరాల బ్యారేజ్ చరిత్రలో రికార్డ్‌ స్ధాయిలో కృష్ణమ్మకి వరద కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద 11.25 లక్షలు క్యూసెక్కులు ఇన్ ఫ్లో దాటింది. అంతకుముందు 2009 సంవత్సరం అక్టోబర్ 5 న రికార్డుస్ధాయిలో 10,94,422 క్యూసెక్కుల వరదనీరు, 1903 అక్టోబర్ 7లో మాత్రమే 10,60,830 లక్షల క్యూసెక్కుల వరద ఉధృతి నమోదు కాగా.. ఇప్పుడు ఏకంగా 11 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం దాటింది.  ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరుతాం, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు

వరద ఉద్ధృతి నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్‌పై వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపేశారు. మరోవైపు బ్యారేజ్‌ గేట్లకు బోట్లు అడ్డుపడ్డాయి. ప్రజలు, వాహనాలతో అక్కడ రద్దీ వాతావరణం ఏర్పడింది. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక (2nd Alert at Prakasam Barrage) కొనసాగుతోంది. బ్యారేజీ నుంచి 11.40 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. కాల్వలకు 500 క్యూసెక్కులు వదులుతున్నారు. మొత్తం 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజ్‌ వద్ద 24.4 అడుగుల మేర నీటిమట్టం కొనసాగుతోంది.

Here's Videos

కృష్ణమ్మకు వరద పోటెత్తింది. వరదల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజీ వైపు బోట్లు కొట్టుకొస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉద్ధృతికి కొట్టుకొని వచ్చిన మూడు బోట్లు (Boats Stuck in Prakasam Barrage) ప్రకాశం బ్యారేజీ గేట్లకు అడ్డుపడ్డాయి. గేట్ల నుంచి విడుదల చేస్తున్న నీటికి అడ్డుగా మారడంతో నీరంతా నిలిచిపోయింది. ఈ మూడు బోట్లు తగలడంతో బ్యారేజీలో ఓ పిల్లర్‌ పాక్షికంగా దెబ్బతింది. మూడు భారీ పడవలు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ప్రకాశం బ్యారేజ్ గేట్లలో 69వ నెంబర్ గేటు ధ్వంసమైంది. ఒక పక్కకు ఒరిగింది.బోట్లు ఢీకొట్టడంతో గేట్లు లిఫ్ట్‌ చేసే ప్రాంతాల్లో దెబ్బతిన్నాయి.  వరద ప్రవాహంలో కొట్టుకొచ్చిన కారుపై మహిళ మృతదేహం.. వెళ్లేందుకు ఎవరూ ధైర్యం చేయకపోవడంతో కొన్ని గంటలపాటు అలాగే.. విజయవాడలో హృదయవిదారక ఘటన.. గుండెల్ని మెలిపెట్టే వీడియో మీరూ చూడండి!!

అంతకంతకు పెరుగుతున్న వరద ప్రవాహంతో కృష్ణా పరీవాహక ప్రాంతాలు బిక్కుబిక్కుమంటున్నాయి. ఇప్పటికే బుడమేరుకి గండిపడటంతో సింగ్ నగర్,ఊర్మిలానగర్, ప్రకాశ్ నగర్, వాంబేకాలనీ, ఖండ్రిగ,పైపుల రోడ్, న్యూ రాజరాజేశ్వరిపేట, వైఎస్సార్ కాలనీ, జక్కుంపూడి కాలనీ తదితర ప్రాంతాలు నీట మునిగాయి. వరదల దాటికి కృష్ణలంక రైల్వే బ్రిడ్జి అంచు వరకు వరదనీటి ప్రవాహం చేరింది. నీటి ప్రవాహం మరింత పెరిగితే రైల్వే బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహించే అవకాశం ఉంది.



సంబంధిత వార్తలు