Vijayawada, Sep 2: భారీ వర్షాలు (Heavy Rains), వరదల (Floods) ధాటికి విజయవాడ (Vijayawada) ప్రజలు వణికిపోతున్నారు. దాదాపు నగరమంతా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ముఖ్యంగా నగరంలోని అజిత్ సింగ్ నగర్ లోని బుడమేరు ముంపు ప్రాంతంలో పరిస్థితి మరింత దిగజారింది. ఇలాంటి సమయంలోనే మరో దయనీయ ఘటన చోటుచేసుకుంది. వరద ప్రవాహంలో కొట్టుకొచ్చిన ఓ కారుపై మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అయితే, చుట్టూ వరద ప్రవాహం ఉండటంతో అక్కడికి వెళ్లేందుకు ఎవరూ ధైర్యం చేయలేదు. దీంతో కొన్ని గంటలుగా ఆ మృతదేహం కారు మీద అలాగే ఉండిపోయింది.
కలచివేసే దృశ్యం
AP: భారీ వర్షాలు, వరదల ధాటికి విజయవాడ ప్రజలు వణికిపోతున్నారు. అజిత్ సింగ్ నగర్ లోని బుడమేరు ముంపు ప్రాంతంలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. వరద ప్రవాహంలో కొట్టుకొచ్చిన ఓ మహిళ మృతదేహం కారుపై నిలిచిపోయింది. అక్కడికి వెళ్లేందుకు ఎవరూ ధైర్యం చేయకపోవడంతో కొన్ని గంటలుగా… pic.twitter.com/9J4KWoE6N5
— ChotaNews (@ChotaNewsTelugu) September 1, 2024
అధికారులకు సమాచారమిస్తే..
అయితే, మృతదేహం గురించి అధికారులకు సమాచారమిచ్చినా.. వాళ్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.