Harish Rao vs Jagan Govt: హైదరాబాద్‌లో ఇళ్ల మీది నుంచి నీళ్లు పోతున్నాయి, నువ్వా మా ఏపీ గురించి మాట్లాడేది, హరీష్ రావుకు కౌంటర్ విసిరిన వైసీపీ నేతలు

తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హీట్ పుట్టిస్తున్నాయి. సంగారెడ్డిలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ భవన నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేసిన సందర్భంగా ఏపీలో కనీసం రోడ్లు కూడా సరిగా లేవని పేర్కొన్నారు.

Harish Rao vs Karumuri Nageswara rao (Photo-File Image)

Amaravati, April 12: తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హీట్ పుట్టిస్తున్నాయి. సంగారెడ్డిలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ భవన నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేసిన సందర్భంగా ఏపీలో కనీసం రోడ్లు కూడా సరిగా లేవని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ కార్మికులు అక్కడ ఓటు హక్కును రద్దు చేసుకుని తెలంగాణలో పొందాలన్నారు. దీనిపై ఏపీ నేతల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ నేతలు హరీష్ రావు వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్లు విసురుతున్నారు.

సెల్ఫీ ఛాలెంజ్‌ అంటే 4 ఫేక్‌ ఫోటోలు కాదు బాబు, దమ్ముంటే నేను విసిరే ఛాలెంజ్ స్వీకరించు, చంద్రబాబుకి సరికొత్త సవాల్ విసిరిన సీఎం జగన్

ఏపీలో పరిస్థితులకి, తెలంగాణలో పాలనకి జమీన్ ఆస్మాన్ ఫరక్ (భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా) ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పందించారు. మంత్రి హ‌రీష్ రావు ఆంధ్ర‌పై చేసిన కామెంట్స్ పై కారుమూరి మాట్లాడుతూ.. హ‌రీష్ రావు దౌర్భాగ్య‌పు మాట‌లు మాట‌లు మానుకోవాల‌ని.. అన్ని సౌక‌ర్యాల‌తో వ‌చ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా త‌గ‌లేసుకున్నారో తెలంగాణ ప్ర‌జ‌లు, ప్ర‌తిప‌క్షాలే చెబుతార‌ని.. తెలంగాణ స్కూళ్లకు, ఏపీలో బడులకు తేడాగా గమనించాలన్నారు. హైదరాబాద్‌లో రోడ్లు వేస్తే సరిపోదని... రాష్ట్రమంతా అభివృద్ధి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. హరీష్‌ రావు టైం చూసుకొని ఏపీ వస్తే ఇక్కడ ఏం జరుగుతుందో చూపిస్తామన్నారు.

వైఎస్సార్ ఈబీసి నేస్తం నిధులు విడుదల, 4,39,068 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ.658.60 కోట్ల ఆర్థిక సాయం అందించిన ఏపీ ప్రభుత్వం

ఒక్క వర్షం కురిసిందంటే చాలు హైదరాబాద్ మునిగిపోతుంది. హైదరాబాద్ లో ఇళ్ల మీది నుంచి నీళ్లు పోతున్నాయి. మీరేం చేశారు? హైదరాబాద్ పరిస్థితిని ఘోరంగా చేసింది మీరు’’ అని విమర్శించారు.మీకెన్ని బొక్కలు ఉన్నాయో, ఎన్ని లొసుగులు ఉన్నాయో.. రాష్ట్రాన్ని మీరు ఎంత తగలేశారో.. మీ ప్రతిపక్షాలే చెబుతున్నాయ్. వాళ్లకు సమాధానాలు చెప్పుకోండి’’ అంటూ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు.

ఏపీలో రోడ్లు సరిగా లేవన్న హరీశ్ వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. ‘‘హైదరాబాద్ లో మాత్రమే రోడ్లు వేస్తే అయిపోయిందా? మా రాష్ట్రంలో ఏం జరుగుతోంది? మా ప్రజలకు ఎన్ని సదుపాయాలు అందుతున్నాయో వచ్చి చూడండి. మీరు ఓట్లు వేసే వాళ్లకే సేవ చేస్తున్నారేమో.. ఓట్లు వేయని చిన్నారులకు కూడా మా జగన్ సేవలు చేస్తున్నారు’’ అని చెప్పుకొచ్చారు. చదువుల్లో ఏపీ 14 వ స్థానంలో ఉండేదని.. ఇప్పుడు 3వ స్థానానికి వచ్చిందంటే ఇది జగన్ క‌ృషేనని మంత్రి కారుమూరి అన్నారు.

కారుమూరి వ్యాఖ్యలపై హరీష్ రావు కౌంటర్

తాను ఏమన్నానని ఆంధ్రా మంత్రులు ఎగిరెగిరి పడుతున్నారని తెలంగాణ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ‘‘ఆంధ్రా మంత్రులు అనవసరంగా మా జోలికి రాకండి... మా గురించి ఎక్కువ మాట్లాడకపోతే మీకే మంచిది’’ అంటూ హెచ్చరించారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.మీ దగ్గర ఏమున్నదని ఓ మంత్రి అంటున్నారు. ఏముందో వచ్చి చూడండి. మా దగ్గర 56 లక్షల ఎకరాల్లో యాసంగి పంట ఉంది. కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, రైతు బీమా, రైతు బంధు ఉన్నాయి.

ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం‌ నిర్మించాం. మీ దగ్గర ఏమున్నాయి?’’ అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఆనాడు ప్రత్యేక హోదా కావాలని అన్నారు.. ఇప్పుడేమో అడగరు. హోదా అంశాన్ని కేంద్రం పక్కకి పెట్టినా పట్టించుకోరు. విశాఖ ఉక్కు అమ్ముతున్నా మాట్లాడరు. అధికారంలో ఉన్న వాళ్లు అడగరు.. ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు ప్రశ్నించరు. విశాఖ ఉక్కును తుక్కుకి అమ్మినా ఎవ్వరూ నోరెత్తరు. ప్రజలను గాలికి వదిలేశారు.. మీ ప్రయోజనాలు చూసుకుంటున్నారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కలిసి ఏపీని ఆగం చేశాయి’’ అని ఆరోపించారు.

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సి లేళ్ల అప్పిరెడ్డి

తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్‌ రావుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సి లేళ్ల అప్పిరెడ్డి ఫైరయ్యారు. హరీష్‌ రావు వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించనట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. ఏపీ గురించి హరీష్‌కు ఏం తెలుసు? అని ప్రశ్నించారు. అల్లుడు, కూతురు, అందరూ కలిసి తెలంగాణను దోచుకున్నారు అంటూ సంచలన కామెంట్స్‌ చేశారు.

​కాగా, ఎమ్మల్సీ అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హరీష్‌ రావు సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారు. ఏపీ గురించి ఏం తెలుసని హరీష్‌ రావు మాట్లాడుతున్నారు. ఏపీలో సంక్షేమ పథకాలు హరీష్‌రావుకు కనబడటం లేదా?. తెలంగాణలో ప్రతిపక్షాలను ఎదుర్కొనే దమ్ములేక ఏపీ గురించి మాట్లాడుతున్నారు. అల్లుడు, కూతురు, అందరూ కలిసి తెలంగాణను దోచుకున్నారు. చినుకు పడితే హైదరాబాద్‌ రోడ్లపై పడవలో తిరగాల్సిన పరిస్థితి ఉంది. హైదరాబాద్‌ను బాగుచేసుకోలేనివారు మా గురించి మాట్లాడటమేంటి?. లాభాల్లో ఉన్న సింగరేణిని సర్వనాశనం చేశారు. మేము మౌనంగా ఉన్నామని అనుకోవద్దు అంటూ కామెంట్స్‌ చేశారు.

తెలంగాణలో ప్రతిపక్షాలు హరీష్ రావుకు కౌంటర్

ఇదిలా ఉంటే గ‌తంలో వరంగల్ ఎంజీఎంలో శ్రీనివాస్ అనే వ్య‌క్తిని ఎలుకలు కొరకడంతో తీవ్ర రక్తస్రావమై పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. ముందు తెలంగాణ‌లోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు బాగుచేసి ప‌క్క రాష్ట్రాల‌పై కామెంట్స్ చేయ‌లంటున్నారు తెలంగాణలోని ప్ర‌తిప‌క్షాలు. గ‌తంలో కూడా హారీష్ రావు ఆంధ్ర‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. తాము ఏమి చేశామో చెప్ప‌కుండా ప‌దేప‌దే ఆంధ్ర పేరు ఎత్తుకోని రాజ‌కీయం చేయ‌డంలో హారీష్ రావు ముందు వ‌రుస‌లో ఉంటారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Jagan 2.0: ఈసారి నాలో జగన్ 2.0ని చూస్తారు, తొలివిడతలో ప్రజల కోసం తాపత్రయ పడి ఓడిపోయా, ఈ సారి కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తానో చేసి చూపిస్తానని తెలిపిన వైఎస్ జగన్

CM Revanth Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం.. ఎమ్మెల్యేల సీక్రెట్‌ మీటింగ్ నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత, జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో రేవంత్ సమావేశం

KTR Delhi Tour Updates: ఢిల్లీకి కేటీఆర్.. పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టు లాయర్లతో మంతనాలు, మూడు రోజులు ఢిల్లీలోనే ఉండే ఛాన్స్!

Delhi elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు.. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్, త్రిముఖ పోరులో గెలిచేది ఎవరో!

Share Now