CM Jagan (Photo-Twitter/AP CMO)

Markapuram, April 12: మార్కాపురం వేదికగా జరిగిన ఈబీసీ నేస్తం సభలో సీఎం జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఈ రాష్ట్రంలో ఏ కుటుంబాన్ని తీసుకున్నా.. ఏ గ్రామాన్ని తీసుకున్నా… ఏ జిల్లాను తీసుకున్నా… గత ప్రభుత్వంలో ఇంటింటికీ జరిగిన మంచి ఎంత? ఈ ప్రభుత్వం హయాంలో జరిగిన మంచి ఎంత? బేరీజు వేసుకోగల సత్తా చంద్రబాబుకు ఉందా? అంటూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఛాలెంజ్‌ విసిరారు.

ఈ నిజాలు ప్రజలకు తెలుసు… ఇంటింటికీ తెలుసు.. మనిషి మనిషికీ తెలుసు.. అందుకే నిజాలు దాస్తున్నారు… నిందలు.. అబద్ధాలతో ప్రచారాలకు దిగుతున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 చూసినా.. ఒకే అబద్ధాన్ని పదేపదే ప్రచారం చేసి.. నిజాన్ని నమ్మించే ప్రయత్నంచేస్తున్నారు. ఈ అబద్ధాలను బ్యాచ్‌ను ఎక్కడికక్కడ ప్రశ్నించండి.

వైఎస్సార్ ఈబీసి నేస్తం నిధులు విడుదల, 4,39,068 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ.658.60 కోట్ల ఆర్థిక సాయం అందించిన ఏపీ ప్రభుత్వం

గత ఐదేళ్ల హయాంలో ఇక్క ఇళ్లస్థలమైనా ఎందుకు ఇవ్వలేకపోయారు. మనం ఇచ్చిన 30 లక్షల ఇళ్లపట్టాల విషయాన్ని చెప్పండి. అలాంటి ఇళ్లస్థలాలముందు సెల్ఫీ దిగే నైతికత ఉందా?. అయ్యా చంద్రబాబు ఏ మంచి చేశావని… మా ఇంటిముందు స్టిక్కర్‌ వేస్తానంఉన్నావు అని ప్రశ్నించండి’’ అని సీఎం జగన్‌ అన్నారు. టిడ్కో ఇళ్లపై సెల్ఫీ ఛాలెంజ్‌ అంటా?. సెల్ఫీ ఛాలెంజ్‌ అంటే నాలుగు ఫేక్‌ ఫోటోలు కాదు బాబు.. సెల్ఫీ ఛాలెంజ్‌ అంటే ప్రతీ ఇంటికి వెళ్లి ఏం చేశారో చెప్పండి. ప్రజలు మంచి చేశారు అని చెబితే అప్పుడు సెల్ఫీ తీసుకోవాలి. దాన్ని గొప్ప సెల్ఫీ అంటారు.’’ అని సీఎం అన్నారు.

ఏపీ విభజన కేసు విచారణ ఈ నెల 18కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు, విచారణ జాబితాలో వాటిని చేర్చాలని జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ ఆదేశాలు

రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది పేద అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం కింద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని బుధవారం విడుదల చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగే బహిరంగ సభలో ఆయన బటన్‌నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు.

ఏపీలో కరోనా అలర్ట్, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం జగన్, కోవిడ్‌ సోకితే వారిని వెంటనే హాస్పిటల్‌కి తరలించేలా చర్యలు

ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అక్కచెల్లెమ్మలకు సెల్యూట్‌ చేస్తున్నా. అక్కచెల్లెమ్మలకు భరోసా ఇచ్చే కార్యక్రమం. వారిని అన్ని విధాల ఆదుకుంటున్నాం. చిరునవ్వుతో కుటుంబాన్ని నడిపిస్తున్న గొప్ప వ్యక్తులు మహిళలు. అక్కచెల్లెమ్మలకు మంచి చేయాలనే తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తున్నాం. ఓసీ వర్గాలోని అక్కచెల్లెమ్మలకు మంచి చేయాలన్నదే లక్ష్యం. పేదరికానికి కులం, మతం ఉండదు. మాది మహిళ పక్షపాతి ప్రభుత్వం. దేశంలో ఈబీసీ నేస్తం లాంటి పథకం ఎక్కడా లేదు. రెండేళ్లలో రూ.1,258 కోట్లు ఈబీసీ నేస్తం ద్వారా మహిళల ఖాతాల్లో జమ చేశాం. ఈబీసీ నేస్తం లాంటి పథకాలు మేనిఫెస్టోలో లేకపోయినా అమలు చేస్తున్నాం’’ అని సీఎం అన్నారు.

‘‘46 నెలల్లో 2.07 లక్షల కోట్లు డీబీటీ ద్వారా లబ్ధిదారులకు అందించాం. మహిళల సాధికారిత కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టాం. మహిళలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం ఈబీసీ నేస్తం, కాపు నేస్తం ఎన్నికల ముందు చెప్పిన పథకాలు కావు. ఒక్కో ఇంటి విలువ సుమారు రూ.10 లక్షలు. ప్రతీ మహిళను సమయానికి ఆదుకుంటున్నాం. అక్కచెల్లెమ్మలను ఆదుకునేందుకు దిశ యాప్‌. ఏ ఆపద వచ్చినా నిమిషాల్లో పోలీసులు ఉంటారు. ఇలాంటి యాప్‌ దేశంలో ఎక్కడైనా ఉందా?. మహిళలకు 50 శాతం. రిజర్వేషన్‌పై చట్టం చేశాం. మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలి’’ అని సీఎం పేర్కొన్నారు.

‘‘గత ప్రభుత్వంలో ఇలాంటి సంక్షేమ పథకాలు ఉన్నాయా?. గతంలో డీపీటీ పథకం ఉండేది. గతంలో దోచుకో, పంచుకో, తినుకో. మా ప్రభుత్వం డీబీటీ ద్వారా డబ్బులు జమ చేసింది. చంద్రబాబు హయాంలో ఇన్ని పథకాలున్నాయా?. ముసలాయన పాలనలో ఒక్క రూపాయి అయినా మీ ఖాతాల్లో జమ అయ్యిందా?. ముసలాయన పాలనలో ఎవరు పంచుకున్నారు?. ఎవరు దోచుకున్నారు, ఎవరు తిన్నారు ఆలోచన చేయండి’’ అని సీఎం అన్నారు.