IPL Auction 2025 Live

AP MLC Elections: అసెంబ్లీ నుంచి పారిపోయిన చంద్రబాబు రోడ్లమీద ఏదేదో మాట్లాడుతున్నారు, సామాజిక న్యాయంపై చర్చకు వచ్చే దమ్ముందా అంటూ మండిపడిన మంత్రి జోగి రమేష్

సామాజిక న్యాయం అంటే ఏంటో సీఎం జగన్‌ నిరూపించారని తెలిపారు. టీడీపీ పెత్తందారీ వ్యవస్థను బద్దలుకొట్టిన వ్యక్తి వైఎస్‌ జగన్‌ అని కొనియాడారు.

Jogi ramesh (Photo-Twitter)

Amaravati, Feb 21: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు MLC Electionsతో వేడెక్కుతున్నాయి. అధికార ప్రతిపక్షాల మధయ మాటల యుద్దం నడుస్తోంది. తాజాగా మంత్రి జోగి రమేష్ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అసెంబ్లీ నుంచి పారిపోయిన చంద్రబాబు (Chandrababu Naidu) రోడ్లమీద ఏదేదో మాట్లాడుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారికి ఎవరి హయాంలో సామాజిక న్యాయం జరిగిందో చర్చకు చంద్రబాబు సిద్ధమా’ అని సవాల్‌ విసిరారు. చర్చకు వచ్చే దమ్ము చంద్రబాబుకు ఉందా అని నిలదీశారు. బీసీలపై చంద్రబాబుకు నిజంగా ప్రేమ ఉంటే చర్చకు రావాలని మంత్రి జోగి రమేష్‌ ఛాలెంజ్‌ చేశారు.

గన్నవరంలో టీడీపీ ఆఫీసుపై దాడి, వైసీపీ గూండాల పనేనంటూ చంద్రబాబు ఫైర్, జగన్ ఆ మంటల్లో కాలిపోవడం ఖాయమని ట్వీట్

బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉన్నారని మంత్రి జోగి రమేష్‌ (Minister Jogi Ramesh) అన్నారు. సామాజిక న్యాయం అంటే ఏంటో సీఎం జగన్‌ నిరూపించారని తెలిపారు. టీడీపీ పెత్తందారీ వ్యవస్థను బద్దలుకొట్టిన వ్యక్తి వైఎస్‌ జగన్‌ అని కొనియాడారు. సామాజిక విప్లవం వైపు ఆయన అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు.​

ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైఎస్సార్‌సీపీ, 18 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు, సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామని తెలిపిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి

ఈ మేరకు మంత్రి మాట్లాడుతూ.. ‘సీఎం జగన్‌తోనే సామాజిక న్యాయం సాధ్యం. 75 ఏళ్ల చరిత్రలో ఏపీలో మాత్రమే సామాజిక న్యాయం జరిగింది. సీఎం బీసీలను తల ఎత్తుకునేలా చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో సంక్షేమం, అభివృద్ధి వెల్లివిరిస్తోంది. ఆయన పాలనలో బలహీన వర్గాలవారు ఎవరెస్ట్‌ ఎక్కినంత సంతోషంగా ఉన్నారు. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ప్రభుత్వం. రిజర్వేషన్‌లు లేకపోయినా ఎక్కువ పదవులు ఇచ్చిన ఘనత జగన్ ది. డీబీటీ ద్వారా సుమారు రూ.2లక్షల కోట్లు అందజేశారు.

లోకేష్‌ తన స్థాయికి మించి విమర్శలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ స్థానాలను బేరానికి పెట్టిన వ్యక్తి చంద్రబాబు. టీడీపీ రాజ్యసభ స్థానాలను సూట్‌కేసుల కోసం అమ్ముకుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై చంద్రబాబు, లోకేష్‌ విషం కక్కుతున్నారు. పొత్తులు పెట్టుకుని పొర్లాడినా టీడీపీని జనం పట్టించుకోరు. టీడీపీని కూకటి వేళ్లతో పెకిలించాల్సిన అవసరం అందరిపై ఉందని మండిపడ్డారు.



సంబంధిత వార్తలు

AP CM Chandrababu: గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయి..జీవోలను రహస్యంగా ఉంచారని సీఎం చంద్రబాబు మండిపాటు, అధికారాన్ని దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అని కామెంట్

Deputy CM Pawan Kalyan: కేంద్రమంత్రి షెకావత్‌తో డిప్యూటీ సీఎం పవన్ భేటీ, టూరిజం హబ్‌గా ఏపీ..కేంద్రం సాయంతో పలు పర్యాటక ప్రాజెక్టులు రాబోతున్నాయని వెల్లడించిన పవన్ కళ్యాణ్

Rains in AP: బంగాళాఖాతంలో వాయుగుండం.. నేటి నుంచి ఏపీలో భారీ వర్షాలు.. ఈ నెల 29 వరకు వానలే వానలు.. దక్షిణ కోస్తాలో ఈదురుగాలులు

Ambati Rambabu: అసభ్యకర పోస్టులు పెట్టిన టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయరా ? పోలీసులకు సూటి ప్రశ్న విసిరిన వైసీపీ నేత అంబటి రాంబాబు