గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. టీడీపీ కార్యాలయంలోని సామగ్రిని ధ్వంసం చేశారు. ఆఫీసు ఆవరణలో ఉన్న కారుకు నిప్పంటించారు.అయితే ఇది ఎమ్మెల్యే వంశీ అనుచరులు పనేనంటూ టీడీపీ ఆరోపిస్తోంది. కాగా గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేసి, కారుకు నిప్పు పెట్టిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో స్పందించారు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ గూండాల దాడిని, వాహనాలను తగులబెట్టిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా మార్చుతున్న జగన్ ఆ మంటల్లో కాలిపోవడం ఖాయమని పేర్కొన్నారు. వైసీపీ ఉన్మాదులు అరాచకాలు చేస్తుంటే పోలీసులు ఏ గాడిదలు కాస్తున్నారని చంద్రబాబు నిలదీశారు.రాష్ట్రంలో శాంతిభద్రతలు అనేవే లేకుండా చేశారు. పోలీసు శాఖను మూసేశారా? లేక వైసీపీలో విలీనం చేశారా? సీఎం ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వానికి ఈ ఘటనలే ఉదాహరణ. రాష్ట్ర గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలి. ఈ ఘటనకు కారకులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి" అని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు.
Here's Babu Tweet
రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవే లేకుండా చేశారు. పోలీసు శాఖను మూసేశారా? లేక వైసీపీలో విలీనం చేశారా? సీఎం ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వానికి ఈ ఘటనలే ఉదాహరణ. రాష్ట్ర గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలి. కారకుల పై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలి.(2/2)#YSRCPTerrorismInAP #YCPTerroristsAttack
— N Chandrababu Naidu (@ncbn) February 20, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)