Andhra Pradesh: ఏపీలో మే 2 నుంచి ఓపెన్ స్కూల్స్ 10వ తరగతి, ఇంటర్ పరీక్షలు, వృత్తి విద్యా కోర్సులకు మే 13 వ తేదీ నుండి 17వ తేదీ వరకూ ప్రాక్టికల్ పరీక్షలు
మే నెల 2వ తేదీన 10 తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు తెలుగు పరీక్ష ఉంటుందన్నారు.
ఏపీలో ఓపెన్ స్కూల్స్ 10వ తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల (SSC and inter exam schedule released) చేశారు. మే నెల 2వ తేదీన 10 తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు తెలుగు పరీక్ష ఉంటుందన్నారు.
మే నెల 4వ తేదీన 10 తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇంగ్లిష్ పరీక్ష, మే నెల 5వ తేదీన 10 తరగతి, ఇంటర్మీడియట్ వారికి గణితం పరీక్ష (Open School SSC and inter exam) జరుగుతుందని మంత్రి (Adimulapu Suresh) పేర్కొన్నారు. మే నెల 7వ తేదీన 10 తరగతికి శాస్త్ర, సాంకేతిక విజ్ఙానము, ఇంటర్మీడియట్‌కి భౌతికశాస్త్రం, మే నెల 9వ తేదీన 10 తరగత కి సాంఘిక శాస్త్రము, ఇంటర్మీడియట్‌కి రసాయన శాస్త్రం పరీక్షలు జరుగుతాయన్నారు.
మే నెల 10వ తేదీన 10 తరగతి కి హిందీ, ఇంటర్మీడియట్‌కి జీవ శాస్త్రం, మే నెల 11వ తేదీన 10 తరగతికి బిజినెస్ స్టడీస్, ఇంటర్మీడియట్‌కి అన్ని వృత్తి విద్యా సబ్జెక్ట్ లకు పరీక్షలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
ఇంటర్మీడియట్ జనరల్ వృత్తి విద్యా కోర్సులకు మే 13 వ తేదీ నుండి 17వ తేదీ వరకూ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతి విద్యా పీఠం సంచాలకులు కే.వి శ్రీనివాసుల రెడ్డి పేరుతో టైమ్ టేబుల్‌ను మంత్రి విడుదల చేశారు.