AP ECET Results 2020: ఏపీ ఈసెట్-2020 ఫలితాలు విడుదల, 30,654 మంది క్వాలిఫై, ఫలితాలను https://sche.ap.gov.in/ ద్వారా తెలుసుకోండి
విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ ఫలితాలను (AP ECET results 2020 declared) విడుదల చేశారు. విద్యా శాఖ స్పెషల్ సిఎస్ సతీష్ చంద్ర, ఎపి ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, సెక్రటరీ సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 14న రాష్ట్రంలోని 79 కేంద్రాల్లో ఆన్‌లైన్ ద్వారా ఈ పరీక్షలు నిర్వహించారు.
ఇంజనీరింగ్ డిప్లొమో పూర్తిచేసిన విద్యార్ధులు తదుపరి ఉన్నత సాంకేతిక విద్యన కొనసాగించేందుక వీలుగా నిర్వహించిన ఏపీ ఈసెట్-2020 ఫలితాలు (AP ECET Results 2020) మంగళవారం విడుదల అయ్యాయి. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ ఫలితాలను (AP ECET results 2020 declared) విడుదల చేశారు.
విద్యా శాఖ స్పెషల్ సిఎస్ సతీష్ చంద్ర, ఎపి ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, సెక్రటరీ సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 14న రాష్ట్రంలోని 79 కేంద్రాల్లో ఆన్‌లైన్ ద్వారా ఈ పరీక్షలు నిర్వహించారు. 31,891 మంది పరీక్షలకు హాజరుకాగా, 30,654 మంది క్వాలిఫై అ య్యారు. 96.12 శాతం ఉత్తీర్ణత సాధించారు. క్వాలిఫై అయినవారిలో 25160 మంది పురుషులు, 6731 మంది మహిళలు ఉన్నారు.
ఫలితాలు తెలుసుకోవాలనుకున్న వారు ఈ లింక్ మీద క్లిక్ చేసి వివరాలను పొందవచ్చు. అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ విభాగంలో అనంతపురానికి చెందిన గొర్తి వంశీకృష్ణ టాపర్ గా నిలిచారు. బీఎస్సీ మేథమెటిక్స్ విబాగంలో శ్రీకాకుళానికి చెందిన శివాల శ్రీనివాసరావు టాపర్ గా నిలిచారు.
సబ్జెక్టుల వారీగా ర్యాంకర్లు
అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ : గొర్తి వంశీకృష్ణ, (అనంతపురం )
బీఎస్సీ మేథమెటిక్స్ : శివాల శ్రీనివాసరావు (శ్రీకాకుళం)
సిరామిక్ టెక్నాలజీ: తూతిక సంతోష్ కుమార్ (ప్రకాశం జిల్లా)
కెమికల్ ఇంజనీరింగ్: ముస్తాక్ అహ్మద్ (గుంటూరు)
సివిల్ ఇంజనీరింగ్: బానోతు అంజలి (ఖమ్మం)
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ : కోడి తేజ (కాకినాడ)
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్: నరేష్ రెడ్డి ( కడప)
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్: కుర్రా వైష్ణవి ( గుంటూరు జిల్లా రేపల్లే)
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ట్రుమెంటెరషన్ ఇంజనీరింగ్ : ఫృద్వీ ( రంగారెడ్డి)
మెకానికల్ ఇంజనీరింగ్ : గరగా అజయ్ ( విశాఖపట్టణం)
మెటలర్జికల్ ఇంజనీరింగ్ : వరుణ్ రాజు ( విజయనగరం)
మైనింగ్ ఇంజనీరింగ్ : బానాల వంశీకృష్ణ (ములుగు)
ఫార్మసీ: అశ్లేష్ కుమార్( కృష్ణా జిల్లా చల్లపల్లి), శాంతి ( శ్రీకాళుళం జిల్లా మందస)