TS EAMCET Results 2020: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు నేడు విడుదల, మధ్యాహ్నం 3.30గంటలకు విడుదల చేయనున్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రెండు విడతల్లో కౌన్సెలింగ్‌ ప్రక్రియ
AP 10th Class Exams Cancelled. Representational Image. |(Photo Credits: PTI)

Hyderabad, Oct 6: తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీర్‌ విభాగం ఫలితాలు (TS EAMCET Results 2020) నేడు వెలువడనున్నాయి. మధ్యాహ్నం 3.30గంటలకు జేఎన్టీయూహెచ్‌లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను (TS EAMCET 2020 Results) విడుదల చేయనున్నారు. ఇక ఇంజినీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ఈ నెల 9న ప్రారంభం కానుంది. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి అధ్యక్షతన సమావేశమైన ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ఖరారు చేసింది.

నవంబర్‌ రెండో తేదీ వరకు రెండు విడతల్లో కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తి చేసేలా షెడ్యూల్‌ ఖరారు చేశారు. మిగతా సీట్లను కళాశాలలో భర్తీ చేసేందుకు స్పాట్‌ అడ్మిషన్‌ కోసం నవంబర్‌ 4న మార్గదర్శకాలను ప్రవేశాల కమిటీ మార్గదర్శకాలను విడుదల చేయనుంది. ధ్రువపత్రాల పరిశీలన కోసం ఈ నెల 9 నుంచి 17వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి విద్యార్థులు సహాయం కేంద్రం ఎంచుకోవాలి. ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు కేంద్రాల్లో విద్యార్థుల సర్టిఫికెట్లను అధికారులు పరిశీలించనున్నారు.

అలాగే 12 నుంచి 20వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉండనుంది. ఈ నెల 22న మొదటి విడతలో ఇంజినీరింగ్‌ సీట్లను కేటాయిస్తామని ప్రవేశాల కమిటీ చైర్మన్‌, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. 22 నుంచి 27వరకు బోధనా రుసుం చెల్లించి సెల్ఫ్‌ రిపోర్ట్‌ చేయాలని సూచించారు. ఈ నెల 29న తుది విడత కౌన్సెలింగ్‌ ప్రారంభం అవుతుంది.

వైద్య రంగంలో ముగ్గురికి నోబెల్ బహుమానాలు, హెపటైటిస్ సి వైరస్‌ను కనిపెట్టినందుకు అవార్డులు,ఈ వ్యాధి ద్వారా కాలేయ క్యాన్సర్‌ సోకే ప్రమాదం

అదే రోజు చివరి విడత ధ్రువపత్రాల పరిశీలన కోసం ఆన్‌లైన్‌ స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. 30న పత్రాల పరిశీలన, 30, 31 తేదీల్లో తుది విడుత ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది. నవంబర్‌ 2న తుది విడుత సీట్లను కేటాయిస్తారు. 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌ బోధనా రుసుం చెల్లించి కళాశాలల్లో సెల్ఫ్‌ రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. మిగతా సీట్ల కోసం కాలేజీల్లో స్పాట్‌ నిర్వహిస్తారు. ఇందుకు నవంబర్‌ 4న మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. ఇంజినీరింగ్‌ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను 7న వెబ్‌సైట్‌ను పొందుపరుచనున్నారు.

TS EAMCET 2020 ఫలితాలను ఎలా తనిఖీ చేయాలి :

Eamcet.tsche.ac.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి, హోమ్‌పేజీలో, TS EAMCET 2020 ఫలితాల లింక్‌లో క్లిక్ చేయండి. ప్రదర్శన తెరపై క్రొత్త పేజీ కనిపిస్తుంది. మీ ఆధారాలతో కూడిన వివరాలతో లాగిన్ అవ్వండి.TS EAMCET ఫలితాలు 2020 తెరపై ప్రదర్శించబడుతుంది. ఫలితాలను డౌన్‌లోడ్ చేయండి మరియు భవిష్యత్ ఉపయోగం కోసం దాని ముద్రణను తీసుకోండి.

నేటి నుంచి ఈ సెట్‌ తుది విడుత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభంకానుంది. మంగళ, బుధవారాల్లో అధికారులు ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి, వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఇవ్వనున్నారు. ఈ నెల 9న సెట్‌ తుది విడుత సీట్లను కేటాయించనున్నారు. అలాగే అదే రోజున కళాశాలల్లో ఈ సెట్‌ స్పాట్‌ అడ్మిషన్ల కార్యక్రమం నిర్వహించనున్నారు. మొదటి దశ కేటాయింపు తొలిదశ పూర్తయింది. డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు ఇంజినీరింగ్, డిగ్రీ కోర్సుల్లో నేరుగా రెండో సంవత్సరంలో అడ్మిషన్ పొందేందుకు నిర్వహించే ఈసెట్ ద్వారా తొలిదశలోనే 86 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. 24,832 మంది అభ్యర్థులు అర్హత సాధించగా, ఇందులో 17,647 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు.

కరోనాపై మరో షాకింగ్ న్యూస్, ప్రతి పదిమందిలో ఒకరు కోవిడ్ బారిన పడ్డారు, సంచలన విషయాలను వెల్లడించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, మెజార్టీ జనాభాకు కరోనా ముప్పు ఉందని హెచ్చరిక

వీరిలో 17,529 మంది అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఆప్షన్లు నమోదు చేశారు. ఈసెట్ ద్వారా మొత్తం 10,418 సీట్ల భర్తీకి అవకాశం ఉండగా.. మొదటి విడుతలోనే ఏకంగా 86 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఇందులో ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో 170 కాలేజీల్లో 9,388 సీట్లు ఉండగా, 8,953 సీట్లకు అభ్యర్థులు ఎంపిక కావడంతో మొదటి విడతలోనే ఏకంగా 95.36 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఫార్మసీ స్ట్రీమ్‌లో 125 కాలేజీల్లో 1,030 సీట్లు ఉండగా, కేవలం ఏడుగురు అభ్యర్థులకు మాత్రమే సీట్లు దక్కాయి. ఈ నెల 12 నుంచి అభ్యర్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి.