AP Inter Exams 2022: ఏప్రిల్‌లో ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు, షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నామని తెలిపిన బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు

పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడి యెట్‌ బోర్డు ఏర్పాట్లు చేపట్టింది. ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నామని బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు (Board secretary MV Seshagiri Babu) చెప్పారు.

Exams Representational Image. |(Photo Credits: PTI)

ఏపీలో 2021–22 విద్యాసంవత్సరపు ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు (AP Inter Exams 2022) ఏప్రిల్‌లో జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడి యెట్‌ బోర్డు ఏర్పాట్లు చేపట్టింది. ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నామని బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు (Board secretary MV Seshagiri Babu) చెప్పారు. ఇతర పరీక్షలు, ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఒకేరోజున రాకుండా ఉండేలా షెడ్యూల్‌ రూపొందిస్తామన్నారు. కోవిడ్‌ ప్రొటోకాల్‌ను అనుసరించి అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ పరీక్షలు నిర్వహిస్తామని, పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు, ఇతర అవసరాలకోసం జిల్లాలకు నిధులు మంజూరు చేశామని వివరించారు.

కోవిడ్‌ కారణంగా 2021– 22 విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడం, ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు వీలుకాకపోవడం వంటి కారణాలతో ఇంటర్మీడియట్‌ బోర్డు సిలబస్‌ను 30 శాతం మేర తగ్గించిన సంగతి తెలిసిందే. తక్కిన 70 శాతం సిలబస్‌ను విద్యార్థులకు బోధించినందున ఆ మేరకు పబ్లిక్‌ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ పరీక్షల కు ఉపయోగపడేలా కంటెంట్‌ రూపొందించామని, త్వరలో విద్యార్థులకు అందుబాటులో ఉంచుతా మని శేషగిరిబాబు చెప్పారు.

ఏపీలో ఫిబ్రవరి 14 వరకు రాత్రి కర్ఫ్యూ పొడిగింపు, మాస్క్ లేకపోతే రూ. 100 జరిమానా, కొత్తగా 6,213 మందికి కరోనా, అత్యధికంగా కృష్ణా జిల్లాలో 903 కొత్త కేసులు

ఈ మెటీరియల్‌ ఇం టర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకే కాకుండా జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్, అడ్వా న్స్, నీట్, ఏపీఈఏపీసెట్‌ వంటి వాటికి కూడా ఉపయోగపడుతుందని తెలిపారు. ఫిబ్రవరిలో ఇంటర్మీడియట్‌ ప్రీ ఫైనల్‌ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.



సంబంధిత వార్తలు