Amaravati, Feb 1: ఏపీలో గడచిన 24 గంటల్లో 35,035 కరోనా పరీక్షలు నిర్వహించగా... 6,213 పాజిటివ్ కేసులు (Coronavirus in AP) వెల్లడయ్యాయి. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 903 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 830, తూర్పు గోదావరి జిల్లాలో 731 కేసులు గుర్తించారు.
అదే సమయంలో 10,795 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 22,82,583 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 21,62,033 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,05,930 మందికి చికిత్స జరుగుతోంది. కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 14,620కి పెరిగింది.
కోవిడ్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూని పొడిగించింది. ఫిబ్రవరి 14 వరకు రాత్రి కర్ఫ్యూని పొడిగిస్తున్నట్టు (Andhra Pradesh Night Curfew Extended) ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈరోజుతో నైట్ కర్ఫ్యూ ముగియనుండటంతో... దాన్ని పొడిగించాలని నిర్ణయించింది.
కలవరపెడుతున్న మరణాలు, దేశంలో గత 24 గంటల్లో 1192 మంది మృత్యువాత, కొత్తగా 1,67,059 మందికి కరోనా
మరోవైపు కరోనా నిబంధనలు కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, మాస్క్ లేకపోతే రూ. 100 జరిమానా విధిస్తామని చెప్పింది. వివాహాలు, మతపరమైన కార్యక్రమాలకు బహిరంగ ప్రదేశంలో అయితే గరిష్ఠంగా 200 మంది, ఇన్ డోర్ అయితే 100 మందికి అనుమతి ఉంటుంది. సినిమా థియేటర్లలో 50 శాతం ప్రేక్షకులకు మాత్రమే అనుమతి ఉంటుంది.