Centre Scraps 'No-Detention' Policy: ‘నో డిటెన్షన్‌’ విధానాన్ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఇకపై 5, 8 తరగతులకు ఉత్తీర్ణత తప్పనిసరి

‘నో డిటెన్షన్‌’ విధానాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో 5, 8 తరగతుల విద్యార్ధులు ఇకపై వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సిందే.

Centre Scraps 'No-Detention' Policy (Credits: X)

Newdelhi, Dec 24: కేంద్రప్రభుత్వం (Central Government) కీలక నిర్ణయం తీసుకొన్నది. ‘నో డిటెన్షన్‌’ విధానాన్ని రద్దు (Centre Scraps 'No-Detention' Policy) చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో 5, 8 తరగతుల విద్యార్ధులు ఇకపై వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సిందే. లేకపోతే అదే తరగతుల్లో ఉండాల్సి ఉంటుంది. అయితే ఫెయిల్ అయిన విద్యార్ధులకు రెండు నెలల వ్యవధిలో మరోసారి పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షల్లో పాస్ అయితేనే పై తరగతికి వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ మేరకు సోమవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సుమారు మూడు వేల పాఠశాలల్లో మాత్రమే వర్తించనుంది. వీటిలో కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్ పాఠశాలలు కూడా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు ఇప్పటికే ఈ రెండు తరగతులకు నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేశాయి.

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్ప‌పీడ‌నం.. కోస్తా జిల్లాల‌కు భారీ వ‌ర్షాల ముప్పు.. పూర్తి వివరాలు ఇవిగో..!

మన రాష్ట్రంలో ఇలా..

పాఠశాల విద్య రాష్ట్ర జాబితాలోని అంశం గనుక ‘నో-డిటెన్షన్‌’ విధానం రద్దు విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. తెలుగు రాష్ర్టాల్లో ‘నో-డిటెన్షన్‌’ విధానం కొనసాగుతున్నట్టు విద్యా నిపుణులు చెప్తున్నారు.

ఏపీవాసులు ఊపిరిపీల్చుకునే కబురు.. బలహీనపడిన వాయుగుండం.. తప్పిన ముప్పు.. అయితే, రెండు రోజుల్లో బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన

ఏమిటీ ‘నో-డిటెన్షన్‌’ విధానం?

విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ)-2009 ప్రకారం.. ఒకటి నుంచి 8వ తరగతి వరకూ ఏ విద్యార్థినీ ఫెయిల్‌ చేయకూడదు. వార్షిక పరీక్షల్లో విద్యార్థి అనుకొన్న ప్రతిభ సాధించనప్పటికీ, పై తరగతులకు ప్రమోట్‌ చేయాల్సిందే. దీన్నే ‘నో-డిటెన్షన్‌’ విధానంగా పిలుస్తారు. అయితే, 2019లో ఆర్టీఈలో చేసిన సవరణల్లో ‘నో-డిటెన్షన్‌’ విధానాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.