TGPSC Group-3 Exams: తెలంగాణలో నేటి నుంచి గ్రూప్‌-3 పరీక్షలు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 1,401 పరీక్ష కేంద్రాలు.. హాజరుకానున్న 5,36,395 మంది అభ్యర్థులు

ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్టు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) తెలిపింది.

Hyderabad, Nov 17: తెలంగాణ (Telangana) రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం గ్రూప్‌-3 (TGPSC Group-3 Exams) పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్టు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 1,401 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,36,395 మంది అభ్యర్థులు గ్రూప్‌-3 పరీక్షలకు హాజరుకానున్నారని టీజీపీఎస్సీ తెలిపింది. పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్టు కమిషన్‌ తెలిపింది.

మ‌ణిపూర్ సీఎం నివాసంపై దాడి, మ‌రోసారి ర‌ణ‌రంగంగా మారిన ఇంఫాల్, సీఎం బిరెన్ సింగ్ సుర‌క్షితం

జీహెచ్ఎంసీ పరిధిలో ఇలా..

జీహెచ్ఎంసీ పరిధిలోని మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో పరీక్ష నిర్వహణ కోసం 115 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 65,361మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. రంగారెడ్డిలో 103 పరీక్ష కేంద్రాల్లో 56,394 మంది, హైదరాబాద్‌ లో 102 కేంద్రాల్లో 45,918 మంది పరీక్ష రాయనున్నారు. ములుగు జిల్లాలో అత్యల్పంగా 9 కేంద్రాలుండగా.. 2,173 అభ్యర్థులు హాజరుకానున్నారు. ఆది, సోమవారాల్లో గ్రూప్‌-3 పరీక్షలు జరగనున్నాయి.

యూపీ మంత్రిని టార్గెట్ చేసిన సైబర్ కేటుగాళ్లు.. ఏకంగా రూ. 2.8 కోట్లు కాజేసిన నేరగాళ్లు...పోలీసుల దర్యాప్తు