28 Trains Cancelled: ఏపీ, తెలంగాణ సహా పలు ప్రాంతాలకు ప్రయాణించే ప్యాసింజర్లు అలెర్ట్.. వారం రోజులపాటు 28 రైళ్ల రద్దు.. 23 ఎంఎంటీఎస్ రైళ్లు కూడా రద్దు.. ట్రాక్ నిర్వహణ పనుల నేపథ్యంలోనే నిర్ణయం

సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ పరిధిలో ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా నేటి నుంచి 25 వరకు 28 రైళ్లను రద్దు చేసినట్టు తెలిపింది.

Credits: Google (Representational Image)

Hyderabad, June 19: తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) సహా పలు రాష్ట్రాలకు ప్రయాణించే 28 రైళ్లను (Trains) వారం రోజులపాటు రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే (South Central Railway) ప్రకటించింది. సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ పరిధిలో ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా నేటి నుంచి 25 వరకు 28 రైళ్లను రద్దు చేసినట్టు తెలిపింది. మరో ఆరు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. అలాగే, 23 ఎంఎంటీఎస్ రైళ్లను కూడా నేటి నుంచి ఆదివారం వరకు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

TTD Seva Tickets: నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల.. జూన్ 21 వరకు లక్కీడిప్ కు అవకాశం.. మరిన్ని వివరాలు ఇవే..

రద్దయిన రైళ్లు ఇవే..

Kalyanam at Yellamma Devasthanam: నేడు బల్కంపేట్‌ ఎల్లమ్మ కల్యాణం.. ఆలయం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

పాక్షికంగా రద్దయినవి ఇవే..

నిన్నటి నుంచి ఈ నెల 24 వరకు దౌండ్‌-నిజామాబాద్‌ (11409) రైలును దుద్ఖేడ్‌-నిజామాబాద్‌ మధ్య, నేటి నుంచి 25వ తేదీ వరకు నిజామాబాద్‌-పండర్‌పూర్‌ (01413) రైలును నిజామాబాద్‌-ముద్ఖేడ్‌ మధ్య పాక్షికంగా రద్దు చేశారు. నేటి నుంచి 25 వరకు నంద్యాల- కర్నూలు సిటీ (07498) రైలును  డోన్‌-కర్నూల్‌సిటీ మధ్య,  కర్నూలు -గుంతకల్‌ (07292) రైలు కర్నూలు సిటీ-డోన్‌ మధ్య పాక్షికంగా రద్దయ్యాయి.. కాచిగూడ- మహబూబ్‌నగర్‌ (07583) రైలును ఉందానగర్‌-మహబూబ్‌నగర్‌ల మధ్య, మహబూబ్‌నగర్‌-కాచిగూడ రైలు(07584) మహబూబ్‌నగర్‌-ఉందానగర్‌ల మధ్య పాక్షికంగా రద్దు చేశారు.

Nagpur Horror: కనిపించకుండాపోయిన ముగ్గురు చిన్నారులు విగతజీవులుగా.. కారు డోర్ లాక్ పడటంతో ఊపిరిఆడక, వేడితో మరణం.. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో దారుణం