Tirupati, June 19: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ-TTD) సెప్టెంబరు నెల శ్రీవారి సేవలకు (Srivari Seva) సంబంధించిన టికెట్లను (Tickets) ఆన్ లైన్ (Online)లో విడుదల చేయనుంది. నేడు తిరుమల (Tirumala) శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆన్ లైన్ లో ఉంచనుంది. సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టాదళ పాదపద్మారాధన, ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు నేటి నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు టికెట్లు అందుబాటులో ఉంటాయి. అదే సమయంలో భక్తులు లక్కీడిప్ కోసం తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు.
#TTD will release Srivari Arjitha Seva tickets as electronic DIP registrations for the month of September from June 19. Details inside.#Tirupatihttps://t.co/UIrjGu8Lag
— Telangana Today (@TelanganaToday) June 18, 2023
కల్యాణోత్సవం సేవల కోసం..
ఈ నెల 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లను ఆన్ లైన్ లో ఉంచనున్నారు. అదే రోజున ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను కూడా విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. అదే రోజున (జూన్ 22) ఉదయం 10 గంటలకు పవిత్రోత్సవాల టికెట్లను కూడా ఆన్ లైన్ లో ఉంచనున్నారు. ఈ నెల 23 ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు ఆన్ లైన్ లో విడుదల చేస్తారు.