No New Toll Rates: వాహనదారులకు శుభవార్త.. కొత్త టోల్ రేట్ల అమలు వాయిదా.. లోక్ సభ ఎన్నికల తర్వాత అమలు చేయాలని ఎన్‌హెచ్ఏఐకి ఎన్నికల సంఘం ఆదేశం.. మరి విద్యుత్ టారిఫ్ లు ఎలా?
టోల్ రెట్ల సవరణను లోక్ సభ ఎన్నికల అనంతరం ఆచరణలోకి తీసుకురావాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్ఏఐ)ని భారత ఎన్నికల సంఘం ఆదేశించింది.
Newdelhi, Apr 2: ఏప్రిల్ 1 నుంచి జాతీయ రహదారులపై అమలు చేయాల్సిన కొత్త యూజర్ ఫీజు (టోల్) రేట్ల (Toll Rates) అమలుకు బ్రేక్ పడింది. టోల్ రెట్ల సవరణను లోక్ సభ ఎన్నికల (Loksabha Elections) అనంతరం ఆచరణలోకి తీసుకురావాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్ఏఐ) (NHAI)ని భారత ఎన్నికల సంఘం ఆదేశించింది. కాగా షెడ్యూల్ చేయబడిన టోల్ రుసుము సగటున 5 శాతం మేర పెరగవచ్చుననే అంచనాలున్నాయి.
విద్యుత్ టారిఫ్ లు కూడా..
విద్యుత్ టారిఫ్ సవరణలపై రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ సంఘాలు నిర్ణయం తీసుకోవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తయిన తర్వాత మాత్రమే ఇది అమలు చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.