Hyderabad, Apr 1: అయోధ్య (Ayodhya) రామయ్యను దర్శించాలనుకునే హైదరాబాద్ (Hyderabad) వారికి ఇది శుభవార్తే. హైదరాబాద్ నుంచి నేరుగా అయోధ్యకు విమాన సర్వీసు (Flight Service) అందుబాటులోకి రానుంది. రేపటి నుంచి వారానికి మూడు రోజులు అంటే మంగళ, గురు, శనివారాల్లో విమాన సేవలు అందుబాటులో ఉంటాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎక్స్ ద్వారా వెల్లడించారు. ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ ఈ సేవలను అందుబాటులోకి తెస్తోంది. హైదరాబాద్ నుంచి అయోధ్యకు రెండు గంటల్లోనే చేర్చనుంది.
@flyspicejet is set to launch direct flights connecting Hyderabad to Ayodhya, starting from April 2 . The flights will operate three times a week, providing a two-hour journey between the two cities.#Hyderabad #Ayodhya #DirectFlights pic.twitter.com/yng8Ox6ROp
— Informed Alerts (@InformedAlerts) March 31, 2024
షెడ్యూల్ ఇలా..
మంగళ, గురు, శనివారాల్లో ఉదయం 10.45 గంటలకు శంషాబాద్ నుంచి విమానం బయలుదేరి మధ్యాహ్నం 12.45 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది. అదే రోజుల్లో మధ్యాహ్నం 1.25 గంటలకు అయోధ్యలో బయలుదేరి మధ్యాహ్నం 3.25 గంటలకు విమానం హైదరాబాద్ చేరుకుంటుంది.