KCR Nalgonda Tour: జనగాంలో కేసీఆర్ పర్యటన.. ఎండిపోయిన పంటలను పరిశీలిస్తున్న కేసీఆర్.. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న కేసీఆర్

BRS Chief KCR Tour in Combined Nalgonda District : సాగు నీటి సమస్య వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు మాజీ సీఎం కేసీఆర్‌ ఆదివారం నల్గొండ జిల్లాలో పొలం బాట పట్టారు. ఆదివారం జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం లోని ధరావత్ తండాలో పంట ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన పలువు రైతులను కేసీఆర్ పరామర్శించారు.

KCR Nalgonda Tour: జనగాంలో కేసీఆర్ పర్యటన.. ఎండిపోయిన పంటలను పరిశీలిస్తున్న కేసీఆర్.. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న కేసీఆర్

BRS Chief KCR Tour in Combined Nalgonda District :  సాగు నీటి సమస్య వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు మాజీ సీఎం కేసీఆర్‌ ఆదివారం నల్గొండ జిల్లాలో పొలం బాట పట్టారు.  ఆదివారం జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం లోని ధరావత్ తండాలో పంట ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన పలువు రైతులను కేసీఆర్ పరామర్శించారు.  నీళ్లు అందక ఎండిపోయిన పంట పొలాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలించి రైతులకు భరోసా ఇచ్చారు. దుఃఖంలో ఉన్న రైతులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా నాలుగు బోర్లు వేసినా చుక్క నీరు రాక నాలుగు ఎకరాల పంటను కోల్పోయిన ఆంగోతు సత్తెమ్మ కేసీఆర్ ముందు తన గోడువెల్ల బోసుకుంది. బోర్లు వేసి నీళ్లు రాక పంటలు ఎండిపోయి దాదాపు నాలుగైదు లక్షల అప్పు అయిందని కేసీఆర్ ముందు విలపించారు. తన కొడుకు పెళ్లి పెట్టుకున్నానని పంట ఎండిపోవడంతో చేతిలో చెల్లి గవ్వలేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవడంతో తక్షణమే స్పందించిన కేసీఆర్ సత్యమ్మ కుమారుని వివాహ ఖర్చు నిమిత్తం ఐదు లక్షల రూపాయలను అక్కడికక్కడే ప్రకటించారు. రైతులు ధైర్యంగా ఉండాలని పోరాడి మన నీళ్లను మనం సాధించుకుందామని.. 24 గంటల కరెంటును సాధించుకుందామని.. రైతు రుణమాఫీని, రైతు బంధు పోరాడి సాధించుకుందామని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండి రైతన్న కన్నీళ్లు పెడుతుంటే.. కనీసం చీమ కుట్టినట్టయినా లేదు ఈ కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వానికి అని విమర్శించారు. అంతేకాదు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతూ.. రాజకీయాలలో బిజీగా ఉన్న దుర్మార్గపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని విమర్శించారు.

(The above story first appeared on LatestLY on Mar 31, 2024 03:40 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).