Govt Bans 14 Fixed Dose Combination Drugs: ఈ కాంబినేషన్ మందులు వాడొద్దని హెచ్చరిస్తూ 14 ఔషధాలను బ్యాన్‌ చేసిన కేంద్రప్రభుత్వం.. నిషేధిత ఔషధాలలో సాధారణ ఇన్ఫెక్షన్లు, దగ్గు, జ్వరం చికిత్సకు ఉపయోగించే మందులు.. కారణం ఏంటంటే??

నిషేధిత ఔషధాలలో సాధారణ ఇన్ఫెక్షన్లు, దగ్గు, జ్వరం చికిత్సకు ఉపయోగించే మందులు ఉన్నాయి. నిపుణుల కమిటీ సిఫార్సులను అనుసరించి ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.

Medicines (Photo Credits: Pixabay)

Hyderabad, June 4: 14 ఔషధాలను (14 Types of Drugs) బ్యాన్‌ (Ban) చేస్తూ భారత ప్రభుత్వం (Indian Government) కీలక నిర్ణయం తీసుకున్నది. నిషేధిత ఔషధాలలో (Banned Drugs) సాధారణ ఇన్ఫెక్షన్లు, దగ్గు, జ్వరం చికిత్సకు ఉపయోగించే మందులు ఉన్నాయి. నిపుణుల కమిటీ సిఫార్సులను అనుసరించి ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. నిమెసులైడ్, పారాసెటమాల్ డిస్పర్సిబుల్ మాత్రలు, క్లోఫెనిరమైన్ మేలేట్, కోడైన్ సిరప్‌లతో సహా 14 ఫిక్స్‌ డ్-డోస్ కాంబినేషన్ డ్రగ్స్‌ ను ప్రభుత్వం నిషేధించింది. ఈ మందులకు చికిత్సాపరమైన సమర్థన లేదని, వాటిని ఉపయోగించడం వల్ల ప్రమాదం కలిగే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

JEE Advanced 2023: నేడు జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ పరీక్ష.. జేఈఈ మెయిన్‌లో కటాఫ్‌ మార్కులు పొందిన 2.50 లక్షల మంది.. తెలుగు రాష్ట్రాల నుంచి పోటీపడనున్న 35 వేల మంది

నిషేధించిన మందులు ఇవే..

నిషేధిత ఔషధాలలో సాధారణ అంటువ్యాధులు, దగ్గు, జ్వరం చికిత్సకు ఉపయోగించే మందులు ఉన్నాయి. ముఖ్యంగా..

Traffic Restrictions In Hyderabad: హైదరాబాద్‌లో ఆదివారం రోజు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా రూట్లలో ప్రయాణికులకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి లేదని పోలీసుల ప్రకటన, ట్రాఫిక్ డైవర్షన్ ఎందుకంటే?

ఏమిటీ ఎఫ్‌డీసీ మందులు?

ఫిక్స్‌ డ్-డోస్ కాంబినేషన్ డ్రగ్స్‌ (ఎఫ్‌డీసీ) అనేవి స్థిర నిష్పత్తిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రియాశీల ఫార్మాస్యూటికల్ పదార్థాల కలయికను కలిగి ఉంటాయి. 344 కాంబినేషన్‌ల ఔషధాల తయారీ, విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు 2016లోనే ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనిపై ఆయా మందుల తయారీదారులు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో కోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. శాస్త్రీయ సమాచారం లేకుండా ఆ మందులను రోగులకు విక్రయిస్తున్నట్లు ఆ కమిటీ కోర్టుకు నివేదించింది. ప్రస్తుతం నిషేధించిన 14 ఎఫ్‌డీసీ మందులు కూడా ఆ 344 ఔషధాల జాబితాలో ఉన్నవే.



సంబంధిత వార్తలు