Representational Image (File Photo)

Hyderabad, June 4: దేశంలోని 23 ఐఐటీల్లో వచ్చే విద్యా సంవత్సరం (2023-24) బీటెక్‌ సీట్ల భర్తీకి ఆదివారం జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ పరీక్ష నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్‌లో కటాఫ్‌ మార్కులు పొంది ఉత్తీర్ణులైన 2.50 లక్షల మంది అడ్వాన్స్‌ డ్‌ పరీక్ష రాయడానికి అర్హులు కాగా...వారిలో సుమారు 1.90 లక్షల మందే పోటీపడనున్నారు. వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 35 వేల మంది ఉంటారని అంచనా.

Traffic Restrictions In Hyderabad: హైదరాబాద్‌లో ఆదివారం రోజు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా రూట్లలో ప్రయాణికులకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి లేదని పోలీసుల ప్రకటన, ట్రాఫిక్ డైవర్షన్ ఎందుకంటే?

ఎగ్జాం విధానం.. సమయం ఇదే

ఆన్‌లైన్‌ విధానంలో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష జరుపుతారు. రెండు పేపర్లు రాసిన వారిని మాత్రమే ర్యాంకింగ్‌కు పరిగణనలోకి తీసుకుంటారు. ఈసారి కొత్త సిలబస్‌ ఆధారంగా పరీక్ష ఉంటుంది.

Odisha Train Tragedy Update: ఒడిశా రైలు దుర్ఘటనతో 90 రైళ్ల రద్దు.. 46 రైళ్ల దారి మళ్లింపు.. పూర్తి జాబితా ఇదిగో..

ఫలితాలు ఎప్పుడంటే?

పరీక్ష ఫలితాలను ఈనెల 18న వెల్లడిస్తారు. అడ్వాన్స్‌ డ్‌ ర్యాంకు ఆధారంగా ఐఐటీలే కాకుండా దేశవ్యాప్తంగా మరికొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రవేశాలు కల్పిస్తాయి. గత విద్యా సంవత్సరం (2022-23) అన్ని ఐఐటీల్లో 16,598 సీట్లు అందుబాటులో ఉండగా...ఈసారి మరో 200 వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.