New Traffic Rules In Hyd: రాంగ్ రూట్ లో వచ్చే వాహనాలకు రూ. 1,700 ఫైన్.. ట్రిపుల్ రైడింగ్ కు రూ. 1,200 జరిమానా.. హైదరాబాద్ లో నేటి నుంచి ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం!
అవును. ఇప్పటికే పలు కఠిన నిబంధనలను అమలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు... ఈ రోజు నుంచి స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించబోతున్నారు. ఆ వివరాలు ఏంటంటే?
Hyderabad, Nov 27: రాంగ్ రూట్ (Wrong Route) లో వచ్చే వాహనాలకు (Vehicles) రూ. 1,700 ఫైన్ (Fine).. ట్రిపుల్ రైడింగ్ (Triple Riding) కు రూ. 1,200 జరిమానా.. ఏంటిది అనుకుంటున్నారా? ట్రాఫిక్ నిబంధనలను (Traffic Rules) ఉల్లంఘించేవారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు (Hyderabad Traffic Police) ఉక్కుపాదం మోపనున్నారు. అవును. ఇప్పటికే పలు కఠిన నిబంధనలను అమలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు... ఈ రోజు నుంచి స్పెషల్ డ్రైవ్ (Special Drive) ను నిర్వహించబోతున్నారు.
రాంగ్ రూట్ లో రావడం, ట్రిపుల్ రైడింగ్ తదితర కారణాలవల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు చేసిన అధ్యయనంలో తేలింది. దీంతో, వీటిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా రాంగ్ రూట్ లో వచ్చే వాహనాలకు రూ. 1,700, ట్రిపుల్ రైడింగ్ కు రూ. 1,200 వరకు జరిమానా విధించనున్నారు.
అలాగే, జీబ్రా లైన్ దాటిన వాహనానికి రూ. 100, ఫ్రీలెఫ్ట్ కు అడ్డంగా వాహనాన్ని నిలిపితే రూ. వెయ్యి ఫైన్ వేయనున్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడరాదని, ప్రతి ఒక్కరూ రూల్స్ ని కచ్చితంగా పాటించాలని, ప్రమాదాల నివారణకు సహకరించాలని ఈ సందర్భంగా అధికారులు విన్నవించారు. రూల్స్ ని ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరి సహకారంతో హైదరాబాద్ ను ప్రమాద రహిత నగరంగా మార్చాలనేదే తమ లక్ష్యమని చెప్పారు.