IMD Weather Updates: రానున్న ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు పైపైకి.. పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. పది రాష్ట్రాల్లో వడగాల్పులు.. ఐఎండీ అంచనా

రానున్న ఐదు రోజుల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది.

Temperature in Telangana (Credits: Twitter)

Newdelhi, April 9: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రానున్న ఐదు రోజుల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత  పెరుగుతాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో  2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర పెంపు చోటుచేసుకోవచ్చని వివరించింది. మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో రానున్న రెండ్రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. ఆ తర్వాత క్రమేపీ వర్షాలు తగ్గుముఖం పడతాయని ఐఎండీ పేర్కొంది.

Punjab New Office Timings: ఇకపై ఒంటిపూట మాత్రమే పనిచేయనున్న ప్రభుత్వ కార్యాలయాలు, విద్యుత్ కోతలతో హాఫ్‌ డే ప్రకటించిన పంజాబ్ సర్కార్‌

పది రాష్ట్రాల్లో వడగాల్పుల ప్రభావం

పది రాష్ట్రాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఈ నెల మొదట్లో ఐఎండీ వెల్లడించింది.