Hyderabad, JAN 15: గ్రేటర్ హైదరాబాద్‌ను (Greater Hyderabad) చలి వణికిస్తోంది. రాత్రి వేళ చల్లని గాలులు వీస్తున్నాయి (Cold Waves). ఉదయం 9 అయినా కూడా చల్లని గాలులు వీస్తుండటంతో నగర వాసులు వణికిపోతున్నారు. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. వృద్ధులు, పిల్లలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో గ్రేటర్‌లో రాత్రి ఉష్ణోగ్రతలు (Cold) స్వల్పంగా పెరిగాయి. అదే సమయంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువకు పడిపోవడంతో పగటి పూట కూడా చలిగాలులు వీస్తున్నాయి.
బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 3.9డిగ్రీలు తగ్గి 27.1డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రతలు 19.0 డిగ్రీలు, గాలిలో తేమ 60 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.