Hyderabad, Jan 9: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) చలిపులి (Cold Wave) పంజా విసురుతోంది. చాలా ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ కే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. మరో మూడ్రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. గత 10 రోజుల క్రితం సాధారణంగా ఉన్న ఉష్ణోగ్రత్రలు ఉన్నట్లుండి తగ్గుతున్నాయి. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, సంగారెడ్డి జిల్లాలో సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆయా జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో 10 డిగ్రీల సెల్సియస్‌లోపే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
'గేమ్ ఛేంజర్' బెనిఫిట్ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరణ.. అయితే, టిక్కెట్ ధరల పెంపునకు ఓకే!
పొగమంచు కూడా..
తెలంగాణతో పాటు అటు ఏపీలో 3 రోజులపాటు ఉదయం వేళల్లో పొగ మంచు ఏర్పడుతుందని, చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు చెప్పారు. వృద్ధులు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.