Hyderabad, Jan 8: తెలుగు రాష్ట్రాలైన (Telugu States) ఏపీ (AP), తెలంగాణలో (Telangana) చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రతి ఏటా సంక్రాంతి పండుగ వరకు చలి తీవ్ర తగ్గుముఖం పడుతుంది. అయితే, దానికి భిన్నంగా చలి-పులి విరుచుకుపడుతున్నది. ముఖ్యంగా తెలంగాణలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. పది రోజుల క్రితం వరకు ఉదయం వేళల్లో ఉష్ణోగ్రతలు డబుల్ డిజిట్ లో ఉండగా.. ప్రస్తుతం సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో 9 డిగ్రీల కన్నా తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరం నుంచి వీస్తున్న చలి గాలులతో ఈ పరిస్థితి నెలకొని ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
పొగమంచు కూడా..
తెలంగాణతో పాటు అటు ఏపీలో 5 రోజులపాటు ఉదయం వేళల్లో పొగ మంచు ఏర్పడుతుందని, చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు చెప్పారు. వృద్ధులు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.