IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్, గుంటూరు డివిజన్ మీదుగా రామేశ్వరం వెళ్లేందుకు స్పెషల్ ట్రైన్స్, సికింద్రాబాద్–రామేశ్వరం–సికింద్రాబాద్ వయా గుంటూరు మీదుగా రాకపోకలు
దక్షిణ మధ్య రైల్వే గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని సికింద్రాబాద్–రామేశ్వరం–సికింద్రాబాద్ వయా గుంటూరు డివిజన్ మీదుగా పలు రైళ్లు కేటాయించడం జరిగిందని రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం నరేంద్రవర్మ గురువారం వెల్లడించారు
ఏపీ నుంచి రామేశ్వరం వెళ్లేవారికి ఇండియన్ రైల్వే శుభవార్త తెలిపింది. దక్షిణ మధ్య రైల్వే గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని సికింద్రాబాద్–రామేశ్వరం–సికింద్రాబాద్ వయా గుంటూరు డివిజన్ మీదుగా పలు రైళ్లు కేటాయించడం జరిగిందని రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం నరేంద్రవర్మ గురువారం వెల్లడించారు. సికింద్రాబాద్–రామేశ్వరం (07685) ప్రత్యేక రైలు (SCR allocates special trains) మార్చి 22, 29, ఏప్రిల్ 5, 12, 19, 26, మే 3, 10, 17, 24, 31, జూన్ 7, 14, 21, 28, జూలై 5, 12, 19, 26 తేదీలలో నడుస్తుంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు కీలక గుర్తింపు, ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి కార్యక్రమానికి ఎంపిక, తూర్పు కోస్తా రైల్వే లో మొట్టమొదటి స్టేషన్‌గా విశాఖను ఎంపిక చేసిన కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ
రామేశ్వరం–సికింద్రాబాద్ (07686) ప్రత్యేక రైలు (Secunderabad to Rameswaram ) మార్చి 24, 31, ఏప్రిల్ 7, 14, 21, 28, మే 5, 12, 29, 26, జూన్ నెలలో 2, 9, 16, 23, 30, జూలై 7, 14, 21, 28 తేదీలలో నడుస్తుందని తెలిపారు. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల రద్దీని తగ్గించే చర్యల్లో భాగంగా గుంటూరు–విశాఖపట్నం మధ్య నడిచే సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రైలుకు తాత్కాలికంగా అదనపు ఏసీ చైర్ కార్ కోచ్‌ను జత చేసి నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. గుంటూరు – విశాఖపట్నం (17239/17240) రైలు ఈ నెల 19 నుంచి ఏప్రిల్ 2 వరకు అదనపు ఏసీ కోచ్‌తో నడవనున్నట్లు తెలిపారు.