కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి (One Station, One Product) కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. ఇందులో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్లో (Visakha Railway Station) ఏటికొప్పాక బొమ్మల స్టాల్ ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. స్థానిక ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకం కోసం ప్రతీ రైల్వే స్టేషన్ ఒక ప్రమోషన్ హబ్‌గా అవుతుందని అధికారులు వెల్లడించారు.
తూర్పు కోస్తా రైల్వే లో మొట్టమొదటి స్టేషన్‌గా విశాఖ ఎంపిక చేశారని, ఈ స్టాళ్లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి ఉన్న మహిళా స్వయం సహాయక బృందాలు, సహకార సంఘాలు, వాల్టేర్ సీనియర్ డీసీఎం కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.
ఇక విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉత్పత్తుల అమ్మకాల్లో ఆల్ టైమ్ రికార్డు సాధించింది. స్టీల్‌ప్లాంట్ 2018–19లో అత్యధికంగా 49,11,194 మెట్రిక్ టన్నుల ఉత్పత్తుల్ని అమ్మి అప్పట్లో రికార్డు సృష్టించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చి 17 నాటికే ఆ రికార్డును అధిగమించి అత్యధిక అమ్మకాలు చేసింది.ఈ ఆర్థిక సంవత్సరంలో 2 వారాలు ముందుగానే పాత రికార్డును అధిగవిుంచడం విశేషం. ఈ సందర్భంగా యాజమాన్యం ఉద్యోగులను అభినందించింది.