Amaravati, Mar 17: ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెమ్యూనేషన్లు కాకుండా వంద కోట్లు బడ్జెట్ దాటిన సినిమాలకు టికెట్ రేట్లు (AP Movie Ticket Prices Row) పెంచుకునేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తున్నట్లు ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని (Minister Perni Nani) తెలిపారు.
టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఆర్‌ఆర్‌ఆర్ మూవీ నిర్మాతలు దరఖాస్తు చేశారని.. పరిశీలించి కమిటీ నిర్ణయం తీసుకుంటుందని మంత్రి అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీరో మేరకు సినిమా టికెట్ల ధరలు పెంచుకోవచ్చని వెల్లడించారు. మొదటి 10 రోజులు సినిమా టికెట్ల ధరలు పెంచుకోవచ్చని తెలిపారు. ప్రజలకు భారం కాకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆన్‌లైన్ టికెట్ విధానానికి టెండర్లు ఖరారయ్యాయని. త్వరలోనే ఈ విధానం అమల్లోకి వస్తుందని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.
ఏపీలో మరో మూడు రోజులు జాగ్రత్తగా ఉండండి, వడగాలుల తీవ్రతపై హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
ఏపీ సీఎం జగన్ తనను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారని దర్శక ధీరుడు రాజమౌళి తెలిపారు. తనతో చక్కగా మాట్లాడారని కృష్ణ జిల్లా గన్నవరం విమానాశ్రయం వద్ద జక్కన్న పేర్కొన్న విషయం విదితమే. సోమవారం దర్శక ధీరుడు రాజమౌళి ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీలో నిర్మాత డీవీవీ దానయ్య కూడా ఉన్నారు. ఇక పోతే ఈ నెల 25న ప్రపంవచవ్యాప్తంగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్, తదితర అంశాలపై జక్కన్న సీఎంతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆర్‌ఆర్‌ఆర్ బాగా ఖర్చుతో కూడిన సినిమా కాబట్టి, అందుకు ఏం చేయాలో అది చేస్తామని సీఎం జగన్‌మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని రాజమౌళి వెల్లడించారు.