JEE Fee Hiked: జేఈఈ మెయిన్ దరఖాస్తు ఫీజు భారీగా పెంపు.. రెండింతలు చేసిన ఎన్‌టీఏ
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అబ్బాయిలకు ఇప్పటి వరకు రూ. 650 ఫీజు వసూలు చేస్తుండగా ఇప్పుడు దానిని రూ. 1000కి పెంచేసింది. అదే కేటగిరీలోని అమ్మాయిల ఫీజును రూ. 325 నుంచి రూ. 800 చేసింది.
Newdelhi, Dec 17: జేఈఈ మెయిన్ (JEE Main) షెడ్యూల్‌ను ఇటీవలే ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) (NTA) పరీక్ష ఫీజులను (తొలి విడుత) భారీగా అంటే దాదాపుగా రెండింతలు పెంచేసింది. జనరల్ (General), ఈడబ్ల్యూఎస్ (EWS), ఓబీసీ (OBC) అబ్బాయిలకు ఇప్పటి వరకు రూ. 650 ఫీజు (Fee) వసూలు చేస్తుండగా ఇప్పుడు దానిని రూ. 1000కి పెంచేసింది. అదే కేటగిరీలోని అమ్మాయిల ఫీజును రూ. 325 నుంచి రూ. 800 చేసింది.
ఇక, ఎస్‌టీ, ఎస్‌సీ, దివ్యాంగులకు ఇప్పటి వరకు రూ. 325 ఫీజు వసూలు చేస్తుండగా ఇప్పుడు దానిని రూ. 500కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. విదేశీ అమ్మాయిల ఫీజును రూ. 1,500 నుంచి నుంచి రూ. 4 వేలకు, అబ్బాయిల ఫీజును రూ. 3 వేల నుంచి రూ. 5వేలకు పెంచింది. దీంతోపాటు బీఆర్క్, బీ ప్లానింగ్‌లో చేరేందుకు నిర్వహించే పేపర్-2 దరఖాస్తు ఫీజును కూడా భారీగా పెంచారు.
బెంజ్ కారును తోసుకెళ్లిన ఆటో.. వీడియో ఇదిగో!
కాగా, 2023-24 సంవత్సరానికి సంబంధించి జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షలు జనవరి 24-31 మధ్య జరగనున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 11 లక్షలమంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఇప్పుడీ పరీక్షల దరఖాస్తు ఫీజును ఎన్‌టీఏ భారీగా పెంచేసింది.