Southwest Monsoon 2024 Update: ఐఎండీ చల్లని కబురు, వచ్చే వారం తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాలు, ఇప్పటికే కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు నేడు (గురువారం) కేరళను తాకినట్లుగా వెల్లడించింది. కేరళ సహా ఈశాన్య రాష్ట్రాల్లోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించాయి.

rains

తొలకరి పలకరింపు కోసం ఎదురుచూస్తున్న దేశవాసులకు భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) గుడ్‌న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు నేడు (గురువారం) కేరళను తాకినట్లుగా వెల్లడించింది. కేరళ సహా ఈశాన్య రాష్ట్రాల్లోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించాయి. ఈ నేపథ్యంలో రానున్న మూడు లేదా నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఎట్టకేలకు ఈ వారంలో తెలుగు రాష్టాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. గతేడాది కంటే ముందుగానే నైరుతి పవనాలు రాగా, ఇప్పటికే కేరళ వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాలు.. కేరళ రాష్ట్రాన్ని ఐఎండీ అలెర్ట్ చేసింది. నాలుగైదు రోజుల్లో రుతుపవనాలు రాయల­సీమ­లోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతా­వరణ శాఖాధికారులు తెలిపారు.  ఐఎండీ గుడ్ న్యూస్, కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ

ఇప్పటికే నైరు­తి రుతుపవనాలు దక్షిణ అరేబియా సము­ద్రం­లోని ఎక్కువ ప్రాంతాలు, మాల్దీవులు, కొమోరిన్‌ ప్రాంతాల్లో విస్తరించాయి. లక్షద్వీప్‌లోని కొన్ని ప్రాంతాలు, కేరళ, మరికొన్ని భాగాలు నైరుతి, మధ్య బంగా­ళాఖాతం, ఈశాన్య బంగాళా­ఖాతం, ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరిస్తున్నాయి. కాగా, వారం ముందుగానే రుతుపవనాలు పురోగమిస్తుండడంతో ఈ సీజన్‌లో సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

తీవ్రమైన ఎండలతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. ముఖ్యంగా ‘రెమాల్‌ తుపాను’ అనంతరం గత రెండు రోజులుగా రాష్ట్రం మండిపోతోంది. వేడి, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా భారీగా నమోదవుతున్నాయి.రాష్ట్రంలో బుధవారం అత్యధికంగా ఒంగోలులో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఉత్తర కోస్తా ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తక్కువగా అనిపిస్తున్నా తేమ కారణంగా ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు.  దేశ రాజధానిలో రికార్డు స్థాయి టెంపరేచర్, వెను వెంటనే చిరుజల్లులు, 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుతో ఢిల్లీ వాసులు విలవిల

ఆంధ్రప్రదేశ్‌లో గురువారం ఎండలు మరింత మండిపోయే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవ్వొచ్చని పేర్కొంది. ఇక శుక్రవారం పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif