AP Rains: ఏపీలో భారీ వర్షాలు.. రేపటి నుంచి మూడు రోజులపాటు వానలే వానలు.. రాయలసీమ, దక్షిణ కోస్తాలో దంచికొట్టనున్న వర్షాలు

ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తాలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

AP Rains (photo-Video Grab)

Vijayawada, Nov 11: ఆంధ్రప్రదేశ్‌ లో (Andhrapradesh) రానున్న మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురవనున్నాయి. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తాలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ  తెలిపింది. నైరుతి బంగాళాఖాతం మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని, దీని ప్రభావంతో మంగళ, బుధ, గురువారాల్లో వానలు పడతాయని వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి మంగళవారం లోగా అల్పపీడనంగా రూపాంతరం చెందే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గుర్తించింది.

రష్యా రాజధానిపై 34 డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్, ఆ డ్రోన్లను కూల్చివేశామని ప్రకటించిన రష్యా సైన్యం

ఐఎండీ హెచ్చరికలు

వర్షాల నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ (ఐఎండీ) (IMD) హెచ్చరించింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది. కాగా, నిన్న ఏపీలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడ్డాయి.

అన్ లిమిటెడ్ ఇంట‌ర్నెట్ తో రెచ్చిపోయిన ఉత్త‌రకొరియా సైనికులు, ఎడాపెడా పోర్న్ చూస్తూ బుక్క‌వుతున్న కిమ్ సైన్యం