AP Rains: మళ్లీ వాన పిలుపు.. రానున్న 24 గంటల్లో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు
ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు.
Vijayawada, Nov 10: నైరుతి బంగాళాఖాతంలో (Bay of Bengal) రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు. రానున్న రెండురోజుల్లో పశ్చిమ దిశగా తమిళనాడు, శ్రీలంక తీరాల మీదుగా ఈ ఆవర్తనం కొనసాగుతుందని పేర్కొన్నారు. అల్పపీడనం నేపథ్యంలో రేపు, ఎల్లుండి, ఆ మరుసటి రోజు దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, మిగతా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు.
ఐఎండీ హెచ్చరికలు
వర్షాల నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ (ఐఎండీ) (IMD) హెచ్చరించింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది.