Heavy Rain Alert for Telangana: రూపుమార్చుకున్న అల్పపీడనం, తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు, ఏపీలో నర్సాపూర్, విశాఖపట్నం మధ్య రాత్రికి తీరం దాటే అవకాశం, హెచ్చరించిన హైదరాబాద్ వాతావరణ శాఖ
ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ (Hyderabad Meteorological Department) హైచ్చరించింది. తూర్పు మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఆదివారం ఉదయం వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి సోమవారానికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.
Hyderabad, Oct 12: తెలంగాణలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు (Heavy Rains in TS) కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ (Hyderabad Meteorological Department) హైచ్చరించింది. తూర్పు మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఆదివారం ఉదయం వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి సోమవారానికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.
ఇది ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) నర్సాపూర్, విశాఖపట్నం మధ్య సోమవారం రాత్రి తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. దీంతో పాటు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, పరిసర ప్రాంతాల్లో 3.1 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు (Heavy Rain Alert for Telangana) కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి తెలిపారు.
ప్రధానంగా ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలతోపాటు గ్రేటర్ హైదరాబాద్‌లో ఒకటి రెండుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు రాజారావు వెల్లడించారు. ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి.
రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను, ప్రజలను ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (CM KCR) కోరారు.అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమీషనర్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులంతా ఎక్కడివారు అక్కడే ఉండి పరిస్థితిని గమనిస్తూ అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని కోరారు. భారీ వర్షాలు, వాటితోపాటే వరదలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేశారు.