Telangana Rains: తెలంగాణకు భారీ వర్ష ముప్పు, అత్యవసర సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‌కు ఆదేశాలు, ఏపీలో రానున్న రెండు రోజుల పాటు వర్షాలు
File image of Telangana CM KCR | File Photo

Hyderabad, Oct 11: రానున్న రెండురోజుల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు (Telangana Rains) కురిసే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు (CM K Chandrasekhar Rao) ఆదేశించారు. ఆదివారం ప్రగతి భవన్‌లో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిశాయని, సోమ, మంగళవారాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించిందని గుర్తుచేశారు.

వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను (CS somesh kumar) ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమీషనర్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులంతా ఎక్కడివారు అక్కడే ఉండి పరిస్థితిని గమనిస్తూ అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని కోరారు. భారీ వర్షాలు, వాటితోపాటే వరదలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేశారు.

కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిపై సమీక్షించి అవసరమైన అన్నిచర్యలు తీసుకోవాలని చెప్పారు. అధికారులంతా స్థానికంగా అందుబాటులో ఉండి పరిస్థితిని గమనించి అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలన్నారు. భారీ వర్షాలు కారణంగా వరదలు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

చాలా చెరువులు పూర్తిస్థాయిలో నిండాయని ఫలితంగా కొన్నిచోట్ల చెరువులకు గండ్లుపడే అవకాశం ఉందని, వరదల వల్ల రోడ్లు తెగిపోయే ప్రమాదం ఉందని, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే పరిస్థితి ఉత్పన్నంకావచ్చని సీఎం చెప్పారు. ఆస్తి, ప్రాణనష్టం జరుగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి అధికారిపై ఉందన్నారు.

వ్యవసాయేతర ఆస్తుల ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియ గడువు మరో 10 రోజులు పొడిగింపు, చట్ట సవరణకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం, కేబినెట్‌ సమావేశంలో పలు బిల్లులకు ఆమోదముద్ర

మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. క్రమంగా బలపడి 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పశ్చిమ వాయువ్యం దిశగా పయనించి సోమవారం రాత్రి నర్సాపురం-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కె.కన్నబాబు తెలిపారు.వాయుగుండం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. తీరం వెంబడి గంటకు 55-75 కి.మీ వేగంతో గాలుల వీచే అవకాశం ఉందని విశాఖ జిల్లాకు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మత్స్య కారులు వేటకు వెళ్లకుండా చూడాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ ఆదేశించారు.